7 ఏళ్లు మంచానికే పరిమితం.. జీవితం తలకిందులైంది.. ఐటెం బ్యూటీ దీనగాధ.
ఒకప్పుడు తన డాన్స్‌తో వెండితెరను ఊపేసిన ఐటమ్ బాంబ్ ముమైత్ ఖాన్ ( Mumaith Khan). ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జీవితాన్ని గడుపుతున్నారు. మహేశ్ బాబు ' పోకిరి 'లో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...' పాటతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత వరుస స్పెషల్ సాంగ్స్‌తో స్టార్ స్టేటస్ సంపాదించారు. అలాగే మగధీర సినిమాలో 'బంగారు కోడిపెట్ట' పాటతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. కానీ అలాంటి కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే ఆమె ఒక్కసారిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఎందుకు? అన్న ప్రశ్నకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె భావోద్వేగంగా సమాధానం చెప్పారు.
ప్రమాదంతో జీవితం తలకిందులు
ముమైత్ వెల్లడించిన వివరాల ప్రకారం... 2016లో ఇంట్లోనే జారి పడిపోవడంతో ఆమె తలకు తీవ్రమైన గాయం అయింది. బయట కనిపించే గాయం లేకపోయినా, మూడు రోజులుగా మెదడులో అంతర్గత రక్తస్రావం జరుగుతున్నట్లు డాక్టర్లు గుర్తించి ఆపరేషన్ చేశారు. దాదాపు 15 రోజులపాటు ఆమె కోమాలో ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రాణాపాయం నుంచి బయటపడినా, మెదడులోని కొన్ని నరాలకు దెబ్బ తగలడంతో ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరించారు.
దీంతో కనీసం ఏడేళ్ల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, ఎలాంటి వ్యాయామం చేయకూడదని, బరువులు ఎత్తకూడదని డాక్టర్లు కఠిన సూచనలు ఇచ్చారు. ఆ సమయంలో ఆమె ఎక్కువగా మంచానికే పరిమితమయ్యారని ముమైత్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మందుల ప్రభావంతో బరువు కూడా పెరిగిందని వెల్లడించారు.

దేవుడు పెట్టిన ఫుల్ స్టాప్
ఈ విరామాన్నిముమైత్ ఖాన్ నిరాశగా కాకుండా, దేవుడు ఇచ్చిన "ఫుల్ స్టాప్"గా భావించానని ముమైత్ అన్నారు. 'ఆ ఏడేళ్లను నేను ఆత్మపరిశీలనకు ఉపయోగించుకున్నాను. నా జీవితాన్ని కొత్తగా అర్థం చేసుకున్నాను' అంటూ భావోద్వేగంగా చెప్పారు. ఆ కష్టకాలంలో తన తల్లి తనను కంటికి రెప్పలా చూసుకున్నారని, ఇప్పటికీ ఏ చిన్న నిర్ణయం తీసుకున్నా తల్లి అనుమతి తప్పనిసరిగా తీసుకుంటానని పేర్కొన్నారు.
బాల్యం నుంచే పోరాటమే
ముమైత్ చిన్నతనం అంతా పేదరికంలోనే గడిచిందట. రోజుకు రెండు రూపాయలు ఆదా చేయడానికి కిలోమీటర్ల కొద్దీ నడిచి స్కూల్‌కు వెళ్లేవారని చెప్పారు. ఆ డబ్బును దాచి తండ్రికి ఇచ్చే చిన్నారి ముమైత్, కేవలం 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తరువాత తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో స్పెషల్ సాంగ్స్, క్యామియో రోల్స్, ప్రధాన పాత్రలు కలిపి దాదాపు వంద సినిమాల వరకు చేశారు. తన జీవితంలో మాదకద్రవ్యాల కేసు, టాక్సీ డ్రైవర్‌తో గొడవ వంటి వివాదాలు కూడా ఎదుర్కొన్నానని ముమైత్ ఓపెన్‌గా చెప్పారు. 'నేను సెక్సీగా నటిస్తే సమాజం వెంటనే నన్ను విలన్‌లా చూస్తుంది. కానీ నా కుటుంబానికి నేను ఎవరో తెలుసు. అదే నాకు చాలు' అంటూ ధైర్యంగా స్పందించారు.
ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్
దీర్ఘకాల అనారోగ్యం తర్వాత ముమైత్ పూర్తిగా కోలుకుని ఇప్పుడు హైదరాబాద్‌లో తన సొంత మేకప్ అకాడమీ ప్రారంభించి యువతకు శిక్షణ ఇస్తున్నారు. నటిగా కాకపోయి ఉంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో అత్యధిక టాటూలు వేసుకున్న మహిళగా నిలిచేదాన్నని సరదాగా చెప్పుకొచ్చారు. ఒకప్పుడు వెండితెరపై గ్లామర్‌తో మాయ చేసిన ముమైత్ ఖాన్, ఇప్పుడు తన జీవితాన్ని కొత్త దారిలో మలుచుకుంటున్నారు. 'దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు... తర్వాత తీసేశాడు... ఇప్పుడు మళ్లీ కొత్త మార్గం చూపిస్తున్నాడు' అన్న ఆమె మాటలు, సెలబ్రిటీల వెనుక కూడా ఎన్నో పోరాటాలు, నిశ్శబ్ద గాయాలు ఉంటాయని మరోసారి గుర్తు చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











