For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ హీరోయిన్లపై ముమైత్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు: వాళ్లంతా అలాంటి పనే చేస్తున్నారు.. పరిస్థితి దారుణమంటూ!

  |

  సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది అమ్మాయిలు ఎంట్రీ ఇస్తుంటారు. వారిలో కొందరు మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ ఒకరు. ఇండస్ట్రీలోకి అందరూ హీరోయిన్లు అవ్వాలని ప్రవేశిస్తే.. ఈమె మాత్రం ఐటెమ్ గర్ల్‌గా ఫేమస్ అయింది. కెరీర్ ఆరంభం నుంచే అవే తరహా పాటలను చేస్తూ పాపులారిటీని సంపాదించుకుంది. అదే సమయంలో పలు వివాదాల్లోనూ భాగం అయింది. ఈ నేపథ్యంలో తాజాగా టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లపై ముమైత్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

  అలా మొదలైన ప్రయాణం.. వరుసగా అవే

  అలా మొదలైన ప్రయాణం.. వరుసగా అవే

  నందమూరి హరికృష్ణ నటించిన ‘స్వామి' అనే సినిమాలో స్పెషల్ సాంగ్ ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ముమైత్ ఖాన్. ఆ తర్వాత పలు చిత్రాల్లోని పాటలకు నర్తించింది. ఈ క్రమంలోనే ‘పోకిరి' సినిమాలోని ఐటం సాంగ్‌తో ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. అప్పటి నుంచి దాదాపు నలభై చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. దీంతో ఈ అమ్మడు వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది.

  అన్ని భాషల్లోనూ అందాల విందు చేసింది

  అన్ని భాషల్లోనూ అందాల విందు చేసింది

  తెలుగులో మాత్రమే కాదు.. దక్షిణాదిలోని తమిళం, కన్నడ భాషల్లోనూ ముమైత్ ఖాన్ ఐటం సాంగ్స్ చేసింది. వాటికి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అక్కడ కూడా బాగా గుర్తింపును దక్కించుకుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోకి సైతం ఎంట్రీ ఇచ్చింది. ఆ భాషలోనూ వరుస అవకాశాలను అందుకుంది. ఇక, ఒడియా, బెంగాలీ భాషల్లో సైతం డ్యాన్సులు చేసి ఆకట్టుకుంది.

  అలాంటి సినిమాల్లో నటించిన ఐటం బాంబ్

  అలాంటి సినిమాల్లో నటించిన ఐటం బాంబ్

  స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన ముమైత్ ఖాన్ పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. ఈ క్రమంలోనే ‘మైసమ్మ ఐపీఎస్' అనే సినిమాలో ప్రధాన పాత్రను పోషించింది. ఆ తర్వాత ‘మంగతాయారు టిఫిన్ సెంటర్', ‘పున్నమి నాగు' సహా పలు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. వీటితో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటించింది. ఇలా చేతి నిండా సినిమాలతో బిజీ అయింది.

  డ్రగ్స్ కేసులో చిక్కుకుని.. బిగ్ బాస్ ఆఫర్

  డ్రగ్స్ కేసులో చిక్కుకుని.. బిగ్ బాస్ ఆఫర్

  ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపిన ముమైత్ ఖాన్.. రాను రానూ ఖాళీ అయిపోయింది. ఇలాంటి సమయంలోనే టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. సరిగ్గా అప్పుడే బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అలా ఆ షోలో కొనసాగుతోన్న సమయంలోనే పోలీసుల విచారణకు సైతం హాజరైంది. అప్పట్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.

  కొత్త అవతారం ఎత్తిన ముమైత్.. స్పెషల్‌గా

  కొత్త అవతారం ఎత్తిన ముమైత్.. స్పెషల్‌గా

  చాలా రోజులుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోన్న ముమైత్ ఖాన్.. ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న ‘డ్యాన్స్ ప్లస్' అనే షోకు జడ్జ్‌గా వచ్చింది. ఓంకార్ నడిపించే ఈ షోలో మోనాల్ గజ్జర్, ఆనీ మాస్టర్, బాబా భాస్కర్, రఘు, యశ్వంత్‌లు కూడా జడ్జ్‌లుగా చేస్తున్నారు. ఎంత మంది ఉన్నా ముమైత్ ఖాన్ మాత్రం తనదైన శైలి జడ్జ్‌మెంట్‌తో స్పెషల్‌గా నిలుస్తోంది.

  రీఎంట్రీ ఇచ్చిన ఐటం గర్ల్.. సిల్మ్‌ స్మిత వల్ల

  రీఎంట్రీ ఇచ్చిన ఐటం గర్ల్.. సిల్మ్‌ స్మిత వల్ల

  ప్రాతినిథ్యం వహిస్తోన్న రెండు టీమ్‌లు బయటకు వెళ్లడంతో కొద్ది రోజులు క్రితం ఈ షో నుంచి ముమైత్ ఖాన్ ఎలిమినేట్ అయిపోయింది. కొన్ని వారాల తర్వాత ఆమె మళ్లీ తిరిగి వచ్చింది. అప్పటి నుంచి షోలో రచ్చ రచ్చ చేస్తోంది. ఇక, తాజాగా జరిగిన బయోపిక్ ఎపిసోడ్‌లో తన టీమ్‌కు చెందిన కంటెస్టెంట్ సిల్క్ స్మిత బయోపిక్‌కు డ్యాన్స్ చేసింది. అప్పుడు ముమైత్ ఏడ్చేసింది.

  Popular Telugu YouTube Host #TNR Lost Life | Filmibeat Telugu
  హీరోయిన్లపై ముమైత్ సంచలన వ్యాఖ్యలు

  హీరోయిన్లపై ముమైత్ సంచలన వ్యాఖ్యలు

  సిల్క్ స్మిత గురించి మాట్లాడుతూ.. ‘నాకు సిల్క్ స్మిత గారే ఆదర్శం. ఆమెను చేసే నేను ఐటం గర్ల్‌గా మారాను. నేను చేసినప్పుడు కూడా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. కానీ, ఇప్పుడు స్టార్ హీరోయిన్లే అలాంటి పాటలు చేస్తున్నారు. అప్పుడు నన్ను తప్పు అన్నవాళ్లే.. ఇప్పుడు వాళ్లు డ్యాన్స్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఇది దారుణం' అంటూ ముమైత్ ఎమోషనల్ అయింది.

  English summary
  Mumaith Khan is an Indian film actress and model. She is notable for her item number appearances in Telugu, Hindi, Tamil, Kannada, Bengali and Odia language films. Besides movies, she has contested in the reality shows like Jhalak Dikhla Jaa 6 and first season of Bigg Boss Telugu.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X