అక్కినేని హీరోతో మృణాల్ ఠాకూర్ అఫైర్?.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన సీతారామం బ్యూటీ!

బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలో మృణాల్ ఠాకూర్ కొంత కాలంగా తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. 'సీతారామం' చిత్రం తర్వాత మృణాల్ ఠాకూర్ కు దక్షిణాదిన మంచి క్రేజ్ ఏర్పడింది. ఆమె నటనటకు తెలుగు ప్రేక్షకులు మాత్రం ఫుల్ ఫిదా అయ్యారు. అప్పటి నుంచి మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేస్తూనే ఉంది. ఇదే క్రమంలో ఈ ముద్దుగుమ్మ పేరు ప్రస్తుతం జోరుగా వినిపిస్తోంది. అక్కినేని హీరోతో ఎఫైర్ సాగిస్తోందనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఫొటో కూడా వైరల్ గా మారింది.. ఇక వీరి ఎఫైర్ గురించిన విషయానికొస్తే వివరాలు ఇలా ఉన్నాయి..

అక్కినేని సుమంత్ తో మృణాల్ ఠాకూర్ ఎఫైర్..
ప్రస్తుతం టాలీవుడ్ లో అక్కినేని సుమంత్ తో మృణాల్ ఠాకూర్ ఎఫైర్ గురించే చర్చ నడుస్తోంది. తాజాగా వీరిద్దరూ ఇలా క్లోజ్ గా కలిసి ఉన్న ఫొటో కూడా నెట్టింట జోరుగా వ్యాప్తి చెందుతోంది. దీంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని సినీ ప్రముఖులు, ఈ ఫొటోను చూసిన నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఒకరితో ఒకరు బాగా క్లోజ్ గా కనిపిస్తుండటంతో వారిద్దరి మధ్య రిలేషన్ కన్ఫమ్ అంటున్నారు. ఇక మృణాల్ ఈ ఫొటోతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిందని కూడా అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వెనక ఉన్న మతలాబ్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. నిజంగానే వీరద్దరూ రిలేషన్ లో ఉన్నారా? లేదా? అన్నది మున్ముందు తేలనుంది. ప్రస్తుతం మాత్రం సుమంత్, మృణాల్ ఠాకూర్ డీప్ రిలేషన్ షిప్ లో ఉన్నారని సినీ పరిశ్రమలో టాక్ వినిపిస్తోంది.

Murnal Thakur Affair with Akkineni Hero Sumanth

మృణాల్ తో సుమంత్ కు ఎలా పరిచయం..
అక్కినేని సుమంత్, మృణాల్ ఠాకూర్ కరోనా తర్వాతనే కలిసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా 2022లో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'సీతారామం' చిత్రంతోనే వీరిద్దరి రిలేషన్ కు పునాది అని అంటున్నారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా.. సుమంత్ బ్రిగార్డియర్ విష్ణు శర్మ పాత్రలో నటించారు. ఆయన నటనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో సైమా అవార్డు కూడా దక్కింది. అయితే ఈ చిత్రం నుంచే సుమంత్ తో మృణాల్ కు పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయం కాస్తా రిలేషన్ షిప్ వరకు వచ్చిందని సినీ లోకం అభిప్రాయపడుతోంది.

ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్..
సీతారామం చిత్రం తర్వాత నుంచి సుమంత్, మృణాల్ చాలా క్లోజ్ గా ఉంటున్నారని అంటున్నారు. సుమంత్ తో ప్రేమ వ్యవహారం తర్వాతనే మృణాల్ కూడా టాలీవుడ్ లో వరుస చిత్రాలకు ఓకే చెప్పిందని టాక్. కొద్ది రోజులుగా సినీ ఫంక్షన్లకు కూడా ఇద్దరూ కలిసి హాజరవుతూ కనిపిస్తుండం, ముఖ్య ఈవెంట్లకూ జంటగా హాజరవుతుండటంతో వారి రిలేషన్ షిప్ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. కానీ ఇంకా అటు సుమంత్ కానీ, ఇటు మృణాల్ ఠాకూర్ గానీ అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ రిలేషన్ షిప్ వార్తలపై వారిద్దరూ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

2006లోనే సుమంత్ కు విడాకులు..
అక్కినేని యంగ్ హీరోగా సుమంత్ టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. కెరీయర్ ప్రారంభం యూత్ ఫుల్ సినిమాలతో ఆకట్టుకున్నారు. సత్యం, గౌరి, గోదావరి, మధుమాసం, బోణి, గోల్కొండ హై స్కూల్ వంటి చిత్రాలతో అరించాడు. సుమంత్ కు ప్రస్తుతం 50 ఏళ్లు ఉంటాయి. ఆయనకు 2004లోనే నటి కీర్తి రెడ్డిని వివాహం చేసుకున్నారు. కానీ వారి మధ్య ఏం జరిగిందో కానీ పెళ్లైన రెండేళ్లకే అంటే 2006లో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి మళ్లీ అక్కినేని సుమంత్ పెళ్లి వార్తలు వినిపించలేదు. కెరీయర్ పైనే ఫోకస్ పెట్టారు. మళ్లీ మొదలైంది.. అనే చిత్రంతో కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత సీతారామం, వాతీ, సార్, అహం రిబూట్ వంటి చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అనగనగా ఒక రౌడీ చిత్రంలో నటిస్తున్నారు. ఇక మృణాల్ ఠాకూర్ అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X