డోస్ పెంచేసిన సీరియల్ హీరోయిన్: బీచ్‌లో చిన్న క్లాత్‌తో కొత్త పెళ్లికూతురు రచ్చ
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతో మంది హీరోయిన్లు దీని ద్వారానే తమ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. అలాగే అందచందాలను చూపిస్తూ ఎనలేని ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు. తద్వారా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో ప్రముఖ సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్ ఒకరు. హిందీ సీరియల్స్ ద్వారా ఇప్పటికే జాతీయ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ భామ.. కొంత కాలంగా సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాల విందు చేస్తోంది. వీటికి భారీ రెస్పాన్స్ దక్కడంతో మరింతగా రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా మౌనీ రాయ్ బీచ్‌లో చిన్న క్లాత్ చుట్టుకుని దిగిన హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? దానిపై మీరూ లుక్కేయండి మరి!

అలా వచ్చి.. ఇలా గుర్తింపుతో
మోడల్‌గా హవాను చూపిస్తోన్న సమయంలోనే మౌనీ రాయ్ 2004లో 'రన్' మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో.. తర్వాత 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి ఎన్నో సీరియళ్లు చేసింది.

ఆ సీరియల్‌తో ఫుల్ ఫేమస్
మౌనీ రాయ్ కెరీర్‌లో ఎన్నో సీరియళ్లు చేసింది. అందులో 'నాగిన్' చాలా ప్రత్యేకమనే చెప్పాలి. మూడు సీజన్ల పాటు ప్రసారం అయిన ఈ సీరియల్‌లో ఆమె లీడ్ రోల్ చేసింది. ఇది ఇండియాలోని పలు భాషల్లో డబ్బింగ్ అయింది. అలాగే, తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. ఇలా దీనితో జాతీయ స్థాయిలో మౌనీ రాయ్ పాపులారిటీని సొంతం చేసుకుంది.

సినిమాలతో పాటు వాటిలో
చేతి నిండా సీరియల్ ఆఫర్లతో సందడి చేసిన మౌనీ రాయ్.. తన కెరీర్‌లో పలు చిత్రాల్లోనూ నటించింది. 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలోనూ చేసింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. అలాగే, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌ల్లోనూ చేసింది.

ప్రేమ వివాహం.. హనీమూన్
తన సుదీర్ఘమైన ప్రయాణంలో మౌనీ రాయ్ చాలా మందితో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ కొంత కాలంగా సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే అతడిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన వీళ్ల వివాహానికి పలువురు సెలెబ్రిటీలు కూడా వచ్చారు. ఇక, ఈ జంట హనీమూన్ తెగ రచ్చ చేసేసింది.

అక్కడ ఎప్పుడూ ఫుల్ బిజీ
వరుసగా సీరియళ్లు, షోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ, మౌనీ రాయ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ సందడి చేస్తోంది.

ఎక్కువగా అలాంటి వాటితో
సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న మౌనీ రాయ్.. ఎక్కువగా అందాల విందు కూడా చేస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతోంది. ఫలితంగా ఈ అమ్మడు దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోతోంది. అలాగే, మౌనీ రాయ్ తన అందచందాలతో ఇంటర్నెట్‌ను కూడా షేక్ చేసి పడేస్తోంది.

బీచ్‌లో రచ్చ చేసిన మౌనీ
మౌనీ రాయ్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్ మాత్రమే ధరించి ఉంది. తద్వారా తన బాడీలోని అందాలు అన్నింటినీ చూపిస్తూ ఘాటు ఫోజు కూడా ఇచ్చింది. తద్వారా ఆమె కుర్రకారు గుండెళ్లో గాయాలు చేసేలా రచ్చ చేస్తోంది. దీంతో మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ బీచ్ ఫోటో విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











