బీచ్‌లో హద్దులు దాటేసిందిగా.. టూ పీస్ బికినీలో నాగినీ భామ హాట్ ఫోజులు

బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి చిత్ర పరిశ్రమలో స్టార్‌లుగా వెలుగొందుతున్న నటీమణులు భారతదేశంలో ఎందరో ఉన్నారు. వీరిలో మౌనీరాయ్ కూడా ఒకరు. స్టార్ హీరోయిన్లను మంచిన క్రేజ్ ఈమె సొంతం. బుల్లితెరపై నటిగా దేశప్రజలకు ఆమె దగ్గరయ్యారు. ఇదే ఫేమ్‌ ఆమెకు ఎన్నో సినిమాల్లో ఆఫర్లు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు మౌనీరాయ్ దేశంలోని అత్యంత డిమాండ్ ఉన్న, భారీ పారితోషికం అందుకునే స్టార్స్‌లో ఒకరు.

28 సెప్టెంబర్ 1985లో పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్‌లో జన్మించారు మౌనీ రాయ్. ఆమె తాతగారు శేఖర్ చంద్ర రాయ్ , తల్లి ముక్తి రాయ్‌లు .. జాత్ర థియేటర్ ఆర్టిస్ట్‌‌లుగా బెంగాల్‌లో ఫేమస్. కేంద్రీయ విద్యాలయాలో చదువుకున్న మౌనీరాయ్.. అనంతరం ఢిల్లీలో ఉన్నత చదువులు అభ్యసించారు. చిన్నప్పటి నుంచి మధుబాల, మాధురి దీక్షిత్, వహీదా రెహ్మన్‌ అంటే ఇష్టపడే మౌనీరాయ్ వారి మాదిరిగానే సినిమాల్లో అడుగుపెట్టాలని అనుకున్నారు.

naagin Fame Mouni Roy bikini photos goes viral

తొలుత బుల్లితెరలో అదృష్టం పరీక్షించుకున్న ఆమె.. 2006లో క్యూంకీ సాస్ భి కబీ బహు తీ అనే సీరియల్ ద్వారా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టారు. తర్వాతా దేవోంకీ దేవ్.. మహాదేవ్, పతి పత్ని ఔర్ వో, దో సహేలియన్, ఝలక్ దిక్లాజా అనే సీరియల్స్‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ దశలో 2015లో వచ్చిన నాగిన్ మౌనీరాయ్ జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ ధారావాహికతో ఆమె దేశ ప్రజలకు సుపరిచితురాలిగా మారిపోయారు. ఈ పాపులారిటీతో సినిమాలలోనూ మౌనీరాయ్‌కి అవకాశాలు వచ్చాయి.

బాలీవుడ్, కొన్ని సౌత్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్‌తో మౌనీరాయ్ దుమ్మురేపారు. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం వచ్చిన బ్రాహ్మాస్త్రతో ఆమె బాలీవుడ్‌లో బలంగా జెండా పాతారు. ప్రస్తుతం ది వర్జిన్ ట్రీ అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఈమెలో మంచి నటే కాదు ఓ డ్యాన్సర్ కూడా ఉంది. పలువురు స్టార్స్‌తో కలిసి ఎన్నో మ్యూజిక్ ఆల్బమ్స్‌ను మౌనీరాయ్ రూపొందించారు. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త సూరజ్ నంబీయార్‌ను మౌనీరాయ్ పెళ్లాడారు. 2022లో గోవాలో వీరి పెళ్లి మలయాళీ, బెంగాలీ సాంప్రదాయాల ప్రకారం ఘనంగా జరిగింది. ఇటీవల ఆమెకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను అందించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ భామలలో స్టార్ హీరోయిన్ దిశా పటానీతో మౌనీరాయ్ క్లోజ్‌గా ఉంటారు. ఎప్పుడు ఖాళీ దొరికినా వీరిద్దరూ ఏదో ఒక ట్రిప్ వేస్తుంటారు. తాజాగా మౌనీ, దిశా, మరో హీరోయిన్‌లు ఓ ఫారిన్ బీచ్‌లో చక్కర్లు కొడుతున్నారు. అంతేకాదు.. ముగ్గురూ టూ పీస్ బికినీలలో హల్ చల్ చేస్తున్నారు. మౌనీరాయ్ తన బ్యాక్ లెస్, నడుము, నాభి అందాలు సెగలు రేపుతున్నారు. మరి ఇంకేందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి. కాగా.. దిశా పటానీ తమిళ్‌లో సూర్య సరసన కంగువాలో నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది.

More from Filmibeat

Read more about: mouni roy movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X