సాయి ధరమ్ తేజ్ నీతో ప్రేమలో పడ్డాడా?.. నెటిజన్ ప్రశ్నకు హీరోయిన్ రిప్లై అదుర్స్
ప్రస్తుతం ఇస్మార్ట్ పోరీ నభా నటేష్ చేసే రచ్చ మామూలుగా లేదు. ఇస్మార్ట్ శంకర్ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఎందరి జీవితాలో మారిపోయాయి. అందులో మరీ ముఖ్యంగా తెలంగాణ యాసలో దుమ్ములేపింది నభా నటేష్. నభా యాటిట్యూడ్, నటనకు యూత్ ఫిదా అయిపోయారు. అందుకే నభాకు అదిరిపోయే ఆఫర్స్ వచ్చాయి. దీనిలో భాగంగానే నభా నటేష్ సాయి ధరమ్ తేజ్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది.

సోలో బ్రతుకే సో బెటర్..
చిత్రలహరి, ప్రతి రోజు పండగే వంటి వరుస హిట్ల తరువాత సాయి ధరమ్ చేస్తోన్న చిత్రం సోలో బ్రతుకే సో బెటర్. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కూడా ప్రాముఖ్యత ఉంటుందట. ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలను చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతంది. అయితే నభా తాజాగా నెటిజన్లతో ముచ్చటించింది.

నెటిజన్లతో చిట్ చాట్..
నభా నటేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మోడ్రన్ డ్రెస్సుల్లో కవ్వించడమే కాకుండా చీర కట్టి అందాల ప్రదర్శన చేస్తూ ఫాలోవర్స్‌ను ఫిదా చేస్తుంది. ఇక తాజాగా నభా నెటిజన్లతో ముచ్చటిస్తూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది.

అది అసలు బిర్యానీయే కాదు..
పబ్ జీ అడతారా? అంటూ అడిగిన ప్రశ్నకు.. అదేంటో నాకు అంతగా తెలియదు నేను ఆడనని నభా సమాధానమిచ్చింది. ఇక వెజ్ బిర్యానీ అంటే ఇష్టమా? చికెన్ బిర్యానీ అంటే ఇష్టమా అని అడిగిన ప్రశ్నకు అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. అసలు నా దృష్టిలో వెజ్ బిర్యానీని బిర్యానీ అనకూడదు, అది పులావ్ లాంటిది.. నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమని నభా తెలిపింది.

తెలుగులో మాట్లాడండి..
ఇక తెలుగులో మాట్లాడండి అని ముద్దుగా అడిగిన నెటిజన్ కోరికను తీర్చింది. డిన్నర్ టైం అయింది.. ఇంకా నా భోజనం రాలేదు.. బాగా ఆకలి వేస్తోంది అని తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడింది. ఇక కరోనా వైరస్ గురించి అడిగితే నాకేం తెలుసు అన్నట్టుగా ఫేస్ పెట్టింది.
Recommended Video

ప్రేమలో పడతాడా?
సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో సాయి ధరమ్ తేజ్.. నీతో ప్రేమలో పడతాడా? అని అడగడంతో నభా ఆశ్చర్యంపోయింది. ఇక ఆ ప్రశ్నకు తెలివిగా సమాధానం చెప్పింది నభా. సినిమాను చూడండి.. చూస్తే మీకే తెలుస్తుంది అని క్లారిటీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











