ఆ హీరోయిన్‌కు ఏమైంది? గాయంతోనే గ్లామర్ షో... ఫోటోలతో కలకలం

కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అయ్యారు నభా నటేష్. తన జీవితంలో తొలి చిత్రంతోనే కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌ కుమార్‌కు జోడీగా ఛాన్స్ దక్కించుకుని అద్భుత విజయాన్ని అందుకున్నారు. అందం, అభినయం పరంగా మంచి మార్కులు వేయించుకున్న నభా నటేష్‌కు నన్ను దోచుకుందువటే‌తో తెలుగులో అవకాశం దక్కింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో బ్రేక్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తన సక్సెస్‌ను కొనసాగించలేకపోయింది. అనూహ్యంగా కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైంది.

Also Read
Razor Day 1 Collections: రేజర్ తొలిరోజు కలెక్షన్స్.. రవిబాబు మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?
Razor Day 1 Collections: రేజర్ తొలిరోజు కలెక్షన్స్.. రవిబాబు మూవీ బాక్సాఫీస్ రిపోర్ట్ ఏంటీ?

శృంగేరికి చెందిన నభా నటేష్.. ఉడిపిలో ఇంజనీరింగ్ చేశారు. చిన్నప్పుడే భరత నాట్యంలో శిక్షణ తీసుకున్నారు. అలాగే ఆమెలో మంచి చిత్రకారిణి కూడా ఉంది. 2013లో ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు పోటీలలో మిస్ ఇంటెలెక్చువల్ టైటిల్ గెలుచుకున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండటంతో మోడలింగ్ నుంచి అటువైపు అడుగుపెట్టారు. అవకాశాల కోసం ఆమె ఎంతో కష్టపడ్డారు. కొన్నిసార్లు అన్నీ వదిలేసి ఉద్యోగం చేసుకుని బతకుదామని కూడా అనుకున్నారట. అయితే ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా జీవితం మారిపోయింది.

Nabha Natesh Boldly Flaunts Surgery Scars in Viral Photoshoot Video

తెలుగులో వరుస అవకాశాలు వస్తున్న దశలో కరోనా వైరస్, లాక్‌డౌన్ వచ్చాయి. ఇదే సమయంలో యాక్సిడెంట్ కావడంతో భుజానికి పెద్ద గాయమై, సర్జరీ వరకు వెళ్లింది. దాదాపు ఏడాది పాటు నభా నటేష్ మంచానికే పరిమితమయ్యారు. ఈ ప్రమాదం ఆమె సినీ జీవితంలో పెద్ద మలుపుగా విశ్లేషకులు చెబుతారు. మంచి ప్రాజెక్ట్స్‌ను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అది నా జీవితంలో క్లిష్ట పరిస్ధితి అని .. బెడ్ రెస్ట్‌లో ఉన్నప్పుడు ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గానూ చాలా కుంగిపోయాను. అయితే ఈ విశ్రాంతి సమయం నాలో ఓర్పును, పోరాడే శక్తి వచ్చాయని నభా నటేష్ తెలిపారు.

Recommended For You
Sathi Leelavathi Day 1 Collections: సతీ లీలావతి కలెక్షన్స్.. లావణ్య త్రిపాఠి మూవీకి తొలిరోజు ఎంతంటే?
Sathi Leelavathi Day 1 Collections: సతీ లీలావతి కలెక్షన్స్.. లావణ్య త్రిపాఠి మూవీకి తొలిరోజు ఎంతంటే?

అయితే ఇప్పటికీ కూడా నభా నటేష్‌కి ఆ గాయం తాలూకా గుర్తులు అలాగే మిగిలిపోయాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే నభా నటేష్ తన సినిమాలు, షూటింగ్స్ ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. ఇటీవల నభా షేర్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆమె భుజంపై సర్జరీ తాలూకా మచ్చలు అలాగే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఏ మాత్రం బాధపడకుండా ఫోటో షూట్‌లో పాల్గొనడం నభా నటేష్ వ్యక్తిత్వానికి నిదర్శనం.

You May Also Like
Ashu Reddy: 9.5 కోట్ల రూపాయల వివాదంలో ట్విస్ట్.. ఎంగేజ్‌మెంట్‌తో షాకిచ్చిన అషురెడ్డి
Ashu Reddy: 9.5 కోట్ల రూపాయల వివాదంలో ట్విస్ట్.. ఎంగేజ్‌మెంట్‌తో షాకిచ్చిన అషురెడ్డి

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభు, నాగబంధం సినిమాలలో నటిస్తున్నారు నభా నటేష్. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతోన్న స్వయంభుని ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించారు. అయితే అప్పటికీ సీజీ వర్క్స్, వీఎఫ్ఎక్స్ పెండింగ్ పడటంతో స్వయంభు రిలీజ్ వాయిదా పడింది. జూన్‌లో పెద్ది, టాక్సిక్ వంటి భారీ చిత్రాలు ఉండటంతో స్వయంభు ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది ఆసక్తిగా మారింది. అటు నాగబంధం మూవీ కూడా పీరియాడికల్ కథాంశంతో రూపొందుతూ ఉండటంతో ఈ సినిమాలతో తన స్థానాన్ని సుస్ధిరం చేసుకోవాలని నభా నటేష్ భావిస్తున్నారు.

Read more about: nabha natesh movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X