8500 కోట్ల సినిమా పాటపై నభా నటేష్ స్టెప్పులు.. పొట్టి దుస్తుల్లో ఇస్మార్ట్ బ్యూటీ రీల్ ట్రెండింగ్!

ఏ ఇండస్ట్రీలో అయినా కూడా సినిమా తీయడం అనేది ఏమాత్రం చిన్న విషయం కాదు. మరి అలా తీసిన సినిమాని థియేటర్స్ లోకి వచ్చేంత వరకు ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం కూడా చిన్న విషయమేమి కాదు. కాగా ఇలా వచ్చిన సినిమా థియేటర్స్ లో పడ్డ గంటల్లోనే పైరసికి లోనవుతుంది. అయితే థియేటర్స్ లోకి వచ్చాక ఇప్పుడు పైరసి అనేది సర్వ సాధారణం అయ్యిపోయింది.

ఒక్క థియేటర్స్ లో సినిమానే కాకండా వెబ్ సిరీస్ లు కూడా ఇలా వచ్చిన వెంటనే అలా పలు సైట్స్ లో దర్శనం ఇస్తున్నాయి. సో సినిమాల విషయంలో దర్శకులు కానీ నటీనటులు కానీ నిర్మాతలు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలి? కానీ అలాంటిది సినిమాకి చెందిన వారే పైరసిని ప్రోత్సహిస్తే?? సరిగ్గా ఇదే చేసింది మన టాలీవుడ్ యంగ్ బ్యూటీ నభా నటేష్. ఈమె తెలుగులో ఇస్మార్ట్ శంకర్ నుంచి మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

Nabha natesh created Reel on 1 billion hit deadpool and wolverine Song

మధ్యలో సోలో బ్రతుకే సో బెటర్.. ఇలా కొన్ని హిట్స్ అందుకుంది. ఇక రీసెంట్ గానే "డార్లింగ్" అంటూ తనకి మేజర్ రోల్ ఉన్న సినిమానే చేసింది. కానీ ఈ చిత్రం అంచనాలు అందుకోలేక చతికిల పడింది. మరి ఈ సినిమా కూడా నేడు ఓటిటిలో రిలీజ్ కి వచ్చేసింది. స్ట్రీమింగ్ యాప్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం వచ్చింది.

వారి ఈ సినిమా కూడా చూడకుండా ఇటవల హాలీవుడ్ లో వచ్చిన "డెడ్ పూల్ అండ్ వుల్వరైన్" పైరసి ప్రింట్ ని పెట్టుకొని అందులో సాంగ్ కి చిందులేస్తుంది. దీంతో ఈ వీడియో విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పొట్టి నిక్కర్ వేసుకొని తన బ్యాక్ కనిపించేలా కావాలని ఒక యాంగిల్ లో తన వెనుక అద్దాన్ని పెట్టుకొని ఇంకో పక్క టీవీ లో డెడ్ పూల్ తో డాన్స్ చేస్తూ రీల్ క్రియేట్ చేసింది.

Nabha natesh created Reel on 1 billion hit deadpool and wolverine Song

మరి డెడ్ పూల్ తో మంచి సింక్ లోనే డాన్స్ చేసేసింది కానీ అసలు ఆ సాంగ్ ని ఇంకా మార్వెల్ వారు ఎక్కడా రిలీజ్ చేయలేదు. అది కూడా విజువల్ గా కూడా విడుదల చేయలేదు. సో ఇలా టీవిలో పెట్టుకోవడం అంటే అది పైరసి కిందకే వస్తుంది కదా మరి? ఇప్పటికీ థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ సినిమా వచ్చిన రెండు మూడు రోజుల్లోనే ఫుల్ క్లారిటీ ప్రింట్ బయటకి వచ్చేసింది. దానిని కొంతమంది ఎడిటర్స్ ఆ సాంగ్ ని కట్ చేసి ఇలా సెట్ చేశారు.

దీనికి ఈమె ఏమో తన సినిమా కూడా చూపించకుండా డెడ్ పూల్ తో డాన్సులు వేస్తుంది. మరి సినిమా వాళ్ళే ఇలాంటివి ప్రోత్సహిస్తే సామాన్య ఆడియెన్స్ చేయకుండా ఉంటారా? కాగా హాలీవుడ్ లో భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ చిత్రం రీసెంట్ గానే వరల్డ్ వైడ్ గా ఏకంగా 1 బిలియన్ డాలర్స్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. దీనితో ఈ సినిమా మన కరెన్సీ ప్రకారం చూస్తే ప్రపంచ వ్యాప్తంగా 8500 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టింది అని చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X