నభా టాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. ఆర్టిస్ట్‌లో ఎంతో ఆర్ట్ దాగి ఉంది!
నన్ను దోచుకుందువటే సినిమాతోనే నభా నటేష్ టాలెంట్ ఏంటో అందరికీ అర్థమైంది. ఆపై ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాస్ క్యారెక్టర్‌ను పోషించి ఇస్మార్ట్ పోరి అని ట్యాగ్‌ను తెచ్చుకుంది. ఇక నభాకు సోషల్ మీడియాలోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. మరీ అంతగా ఎక్స్‌పోజింగ్ చేయకుండానే మోడ్రన్ డ్రెస్సులు, చీరలు కట్టి నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ మధ్యే సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్‌ను కూడా పూర్తి చేసేసింది.
రీసెంట్‌గా అల్లుడు అదుర్స్ అనే మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతోన్నట్టు నభా నటేష్ తెలిపింది. 'నాకు తెలిసి అందరూ తమ తమ పనుల్లో బిజీ అయి ఉంటారు. కానీ అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నా'నని నభా చెప్పుకొచ్చింది. ఇక తాజాగా నభా తనలో దాగివున్న ప్రతిభను అందరికీ పరిచయం చేసింది. అది చూసిన నెటిజన్లు నభా టాలెంట్‌కు షాక్ అవుతున్నారు. నభా కేవలం ఆర్టిస్ట్ మాత్రమే కాదు ఆర్ట్‌లు కూడా వేస్తుందని కామెంట్లు చేస్తున్నారు.

నేనే ఎంటో చెప్పాల్సింది మీరు కాదు.. అది నేను చెప్పాలి.. బ్యాట్ మాన్ డ్రాయింగ్ గీసేందుకు నేను ఆరేడు సార్లు ప్రయత్నించాను. నేను ఎలా గీశానో లైవ్‌లో చూడండి. మీరు కచ్చితంగా గర్వంగా ఫీల్ అవుతారు.. అని నభా గీసిన చిత్రాలను షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నభా ప్రస్తుతం చెక్, అల్లుడు అదుర్స్ చిత్రాలతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











