అలాంటి పాత్ర ఎప్పుడో ఓసారి వస్తుంది.. నభా నటేష్ ఎమోషనల్
కొన్ని సినిమాలు, కొన్ని పాత్రలు ఎప్పటికీ నిలుచుండిపోతాయి. హీరో అయినా హీరోయిన్ అయినా కొన్ని పాత్రలు ఎంతో మెమోరబుల్‌గా ఉంటాయి. ఆ పాత్రను పోషించినప్పుడు ఎక్కువ కనెక్ట్ అవ్వడం, షూటింగ్ అయిపోవడంతో పాత్రను ఎంతో మిస్ అవ్వడం వంటివి జరుగుతుంటాయి. అలా నభా నటేష్‌కు సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం, అందులో పోషించిన అమృత క్యారెక్టర్‌పై అంతటి ప్రేమను పెంచుకున్నట్టు తెలుస్తోంది.
సోలో బ్రతుకే సో బెటర్ సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతోంది. క్రిస్మస్ సందర్భంగా విడుదల కాబోతోన్న ఈ మూవీకి చిరు సాయం అందించాడు. సినిమాపై ఓ ట్వీట్ వేసి ప్రమోట్ చేశాడు. ఈ క్రిస్మస్‌కి విడుదల కాబోతున్న 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా యూనిట్ మొత్తానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నా. లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న తొలి చిత్రంగా ఇది ఫిలిం ఇండస్ట్రీకే ఓ ముఖ్యమైన సందర్భం. ఈ చిత్రానికి లభించే ఆదరణ మొత్తం చిత్ర పరిశ్రమలోనే ఒక స్ఫూర్తిని, స్థైర్యాన్ని కలిగిస్తోందనడంలో సందేహం లేదు. అలాగే ప్రేక్షకులందరూ బాధ్యతగా పేస్ మాస్క్‌లు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఈ చిత్రాన్ని థియేటర్స్‌లో ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పుకొచ్చాడు.

తాజాగా నభా నటేష్ స్పందిస్తూ.. అమృతా.. నేను ఇంత వరకు చేసిన పాత్రల్లో ఎక్కువ ఇష్టమైన క్యారెక్టర్ ఇదే.. మనకు జీవితంలో మళ్లీ ఇలాంటి పాత్రలు రావని తెలిశాక.. ఓ శూన్యం లాంటి ఫీలింగ్ కలుగుతుంది... అలాంటి ఓ పాత్రనే ఇది.. అమృతను చూసి మీరంతా ఎంజాయ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. నా జీవితంలో ఇంత మంచి పాత్ర ఇచ్చినందుకు నా దర్శకుడు సుబ్బుకు థ్యాంక్స్.. అంటూ చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











