దిమాక్ ఖరాబ్ చేసేట్టే ఉంది: హీరోయిన్ నభా నటేష్ సూపర్ హాట్ (ఫోటోస్)

Recommended Video

Nabha Natesh Latest Stills From Ismart Shankar | Ram Pothineni | Puri Jagannadh | Puri Connects

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. తాజాగా చిత్రం బృందం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేకమైన సెట్లో 'దిమాక్ ఖరాబ్' అనే పాటను చిత్రీకరింంచారు.

తెలంగాణ టచ్‌తో సాగే దిమాక్ ఖరాబ్' పాటకు శేఖర్ మాస్టర్ కొనియోగ్రఫీ కంపోజ్ చేశారు. రామ్ పోతినేని గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన డాన్స్ పెర్పార్మెన్స్‌తో మెప్పిస్తారని చిత్ర బృందం చెబుతోంది.

నభా నటేష్ దిమాక్ ఖరాబ్ చేసేట్టే ఉంది

నభా నటేష్ దిమాక్ ఖరాబ్ చేసేట్టే ఉంది

రామ్ పోతినేని, నభా నటేష్‌లపై చిత్రీకరించిన ఈ పాటకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఇందులో నభా నటేష్ సూపర్ హాట్ లుక్ చూస్తుంటే నిజంగానే రేపు థియేటర్లలో ప్రేక్షకుల మతి పోగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

మణిశర్మ బీట్ అదుర్స్

మణిశర్మ బీట్ అదుర్స్

ఈ పాటకు మణిశర్మ అందించిన బీట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి. 'దిమాక్ ఖరాబ్' పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, కీర్తన శర్మ, సాకేత్ ఆలకించారు. రామ్ అభిమానులను ఊర్రూతలూగించే విధంగా ఈ పాట ఉంటుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఈ సాంగ్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

పూరి జగన్నాధ్ మూవీ

పూరి జగన్నాధ్ మూవీ

ఈ చిత్రానికి సంబంధించిన లాంగ్ షూటింగ్ షెడ్యూల్ గోవాలో పూర్తయిన సంగతి తెలిసిందే. శ్రీమ‌తి లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇస్మార్ట్ శంకర్

ఇస్మార్ట్ శంకర్

'ఇస్మార్ట్ శంకర్' మే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. రామ్ సరసన నిధి అగ‌ర్వాల్‌, న‌భా న‌టేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నరు. పునీత్ ఇస్సార్‌, స‌త్య‌దేవ్‌, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుధాంశు పాండే త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్‌: రియ‌ల్ స‌తీష్‌, సాహిత్యం: భాస్క‌ర‌భ‌ట్ల‌, ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధికీ, ఆర్ట్‌: జానీ షేక్‌, సినిమాటోగ్ర‌ఫీ: రాజ్ తోట‌, మ్యూజిక్‌: మ‌ణిశ‌ర్మ‌, నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి కౌర్‌, ద‌ర్శ‌క‌త్వం: పూరి జ‌గ‌న్నాథ్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X