నభా అందాల విందు.. అదరగొట్టేస్తోన్న ఇస్మార్ట్ పోరి
అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది నభా నటేష్. చేసింది రెండు మూడు సినిమాలే అయినా ఫాలోయింగ్ మాత్రం వేరే లెవెల్‌లో ఉంది. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌కు నభా ఎంట్రీ ఇచ్చింది. సినిమా యావరేజ్‌గా నిలిచినా కూడా నభా నటనకు,లుక్స్, పాత్రకు మంచి పేరు వచ్చింది. అలా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మొదటి సారిగా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను కొట్టేసింది.
తెలంగాణ యాసలో సొంతంగా డబ్బింగ్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలా నభా తెలుగు అభిమానుల కోసం భాషను కూడా నేర్చుకుంది. నభా ఇప్పటికే రెండు చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాల్లో నభా నటించింది. అయితే ఈ రెండు సినిమాల్లోనూ నభా పాత్రకు మంచి ప్రశంసలే దక్కాయి. సినిమాల్లోనే కాకుండా నభా సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటుంది.

నభాకు సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఓ సారి చీరకట్టులో కనిపిస్తుంది. మరో సారి మోడ్రన్ డ్రెస్‌లో తళుక్కున మెరుస్తుంది. అయితే నభా అందాల ప్రదర్శన కూడా హద్దుల్లోనే ఉంటుంది. అలా నభా షేర్ చేసే ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా నభా షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. నభా ప్రస్తుతం నితిన్ హీరోగా వస్తోన్న అంధాదున్ రీమేక్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











