‘ఆ టాలీవుడ్ హీరో నన్ను దూరం పెట్టాడు... షూటింగ్‌లో అలాంటి పనులు’

గత కొంతకాలంగా సరైన హిట్ లేక రేసులో వెనుకబడ్డారు కన్నడ బ్యూటీ నభా నటేష్. ఒకప్పుడు వరుస విజయాలతో మంచి జోరు మీదున్న ఈ ముద్దుగుమ్మ.. వ్యక్తిగత కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న స్వయంభుతో పాటు మరో భారీ చిత్రం నాగబంధంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై నభా నటేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలు కనుక హిట్ అయితే హీరోయిన్‌గా టాప్ రేసులో దూసుకెళ్లవచ్చని ఆమె భావిస్తున్నారు.

హీరోయిన్‌గా తొలి చిత్రంతోనే కరునాడ చక్రవర్తి శివరాజ్ కుమార్ సరసన నటించే అవకాశం దక్కించుకున్న నభా నటేష్. కన్నడంలో వజ్రకాయ, లీ, సాహెబ సినిమాలలో నటించారు. అనంతరం నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ మూవీతో నభా .. బ్రేక్ అందుకున్నారు. తర్వాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో సినిమాలలో నటించారు. హీరోయిన్‌గా పీక్స్‌లో ఉన్న దశలో దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డారు.

Nabha Natesh Opens Up About Road Accident Career Break and working with hero Nithin

దాంతో కొన్నాళ్లు మంచానికి పరిమితమైన నభా నటేష్.. మూడేళ్ల అనంతరం డార్లింగ్ సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. నటిగా తనను తాను నిరూపించుకునేందు శ్రమిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. స్వయంభు, నాగబంధం సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నభా నటేష్ మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం, సినిమాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రమాదం కారణంగా నేను ఏడాదిన్నర పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్నా. ప్రమాదంలో భుజానికి భారీ గాయమైంది. కాంక్రీట్ ఎడ్జ్‌లో పడిపోయాను.. తలకు గాయం కాకుండా జాగ్రత్త పడినప్పటికీ మొత్తం బాడీ వెయిట్ అక్కడే పడిపోయి.. ఎముకలు చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోయాయి. ఈ గాయం నుంచి కోలుకోవడానికి టైం పట్టింది. రెండు మూడేళ్లు ఏ పని చేయలేదు. స్ట్రాంగ్‌గా కమ్ బ్యాక్ ఇవ్వడానికి కష్టపడ్డాను. ఆ తర్వాత స్వయంభు షూటింగ్‌లో జాయిన్ అయ్యాను, మధ్యలో డార్లింగ్ మూవీ వచ్చింది. 2024 చివరిలో నాగబంధం స్టార్ట్ చేశాను. ఈ సినిమాలు చాలా పెద్దవి.. వీఎఫ్ఎక్స్, గ్రాండీయర్ భారీతనం కారణంగా షూటింగ్‌లోనే ఉన్నాను అని నభా నటేష్ చెప్పారు

గడిచిపోయిన కాలం గతం.. మన చేతిలో ఉన్న సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. హైదరాబాద్ వస్తే పూరి జగన్నాథ్ గారిని ఖచ్చితంగా కలుస్తాను. జీవితంలో పేరెంట్స్‌కి ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి.. కానీ ఎంతోమంది నాకు సపోర్ట్‌గా నిలిచారు. కృష్ణుడి భగవద్గీతను ఫాలో అవుతా... చిన్న వయసులోనే ఈ ఫిలాసఫి ఫాలో అవ్వడానికి కారణం మా ఊరు శృంగిరి. చిన్నప్పటి నుంచి ఆదిశంకరాచార్యుల గురించి వింటూ, తెలుసుకుంటూ వచ్చాను. ఆ ప్రభావం నా మీద బలంగా పడింది. నాగబంధం ఓ వింత ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. స్వయంభు సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది మేకర్స్ త్వరలోనే ప్రకటిస్తారని నభా వెల్లడించారు.

కెరీర్‌లో నటించిన ఒక్కొక్క నటుడు, దర్శకుడి గురించి చెప్పమని యాంకర్ అడగ్గా.. నితిన్ సార్‌తో చేసినప్పుడు కోవిడ్ ఉద్దృతంగా ఉంది. దాంతో షూటింగ్‌లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సెట్‌లో ఉన్నప్పుడు కూడా ఒకరికొకరు దూరంగా ఉండమని చెప్పారు. షార్ట్ అవ్వగానే మాస్క్ పెట్టుకుని పరుగులు తీసేవాళ్లం. నితిన్ సార్ చాలా ఎనర్జిటిక్.. అందరినీ ఎంతో ప్రేమిస్తారని నితిన్ గురించి నభా నటేష్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ప్రమాదం తర్వాత ఆమె రీ ఎంట్రీ, కష్టంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more about: nabha natesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X