బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఇస్మార్ట్ పోరి సెగలు.. అక్కడ ముడి విప్పిందో అంతే!

తెలుగు సినీ పరిశ్రమలో కన్నడ భామల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అనుష్క శెట్టి, రష్మిక మందన్న, అషికా రంగనాథ్, శ్రీలీల, ప్రియాంక మోహన్ తదితరులు టాలీవుడ్‌ను ఏలుతున్నారు. ఈ కోవలోకే వస్తారు నభా నటేష్. చూడచక్కని అందం, మెస్మరైజింగ్ లుక్‌తో తెలుగు ప్రక్షకులకు బాగా దగ్గరయ్యారు నభా. అయితే ఏమైందో ఏమో కానీ ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలలో కనిపించడం లేదు

11 డిసెంబర్ 1995న కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం శృంగేరీలో జన్మించారు నభా నటేష్. ఉడిపిలోని ఎన్ఎంఏఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన నభా.. భరత నాట్యం, వెస్ట్రన్ డ్యాన్స్‌లలో ప్రావీణ్యం సంపాదించారు. ప్రకాష్ బెలావడి అనే జాతీయ అవార్డ్ అందుకున్న దర్శకుడు ఈమె కెరీర్‌ను మలుపు తిప్పి సినీ జీవితం వైపు బలమైన అడుగులు వేయించారు.

Nabha Natesh PhotoShoot With black and ivory bow mini dress Her latest photos here

19 ఏళ్ల వయసులో కన్నడ అగ్ర కథానాయకుడు శివ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన వజ్రకాయలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని అందుకున్నారు నభా నటేష్. ఈ సినిమా ఏకంగా 100 రోజులు ప్రదర్శింపబడటంతో పాటు వసూళ్ల వర్షం కురవడంతో తొలి చిత్రంతోనే నభా నటేష్ లక్కీ హ్యాండ్ అనిపించుకున్నారు. తర్వాత సాహెబాలో నటించిన నభా నటేష్‌ .. 2018లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించారు.

తన క్యూట్ లుక్స్, నటనతో టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కళ్లలో పడిన నభా నటేష్ .. ఆయన దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌‌లో ఛాన్స్ అందుకున్నారు. ఇందులో నటన, డ్యాన్స్, డైలాగ్‌లలో ఇరగదీసిన నభా నటేష్ ఇస్మార్ట్ పోరి అనిపించుకున్నారు. రాబోయే రోజుల్లో ఈ ముద్దుగుమ్మ దున్నేస్తారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత నభా నటేష్ చేసిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో, డార్లింగ్ వంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.

ఫ్లాప్స్ వచ్చినా హీరోయిన్లు ఎక్కడో ఒక చోట కనిపిస్తారు. కానీ దాదాపు ఏడాది పాటు నభా నటేష్ కనిపించకపోవడంతో ఆమెకు ఏమైందా అని అభిమానులు షాక్ అయ్యారు. తనకు యాక్సిడెంట్ జరిగిందని.. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో కొన్ని సర్జరీలు కూడా చేయాల్సి వచ్చిందని స్వయంగా నభా నటేష్ సోషల్ మీడియా ద్వారా చెప్పడంతో అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రమాదం కారణంగా శారీరకంగా, మానసికంగా ఎంతో బాధను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూలో హీరోయిన్‌గా నటిస్తున్న నభా నటేష్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తరచుగా తన వ్యక్తిగత వివరాలు, సినిమాల డిటెయిల్స్‌ను అప్‌డేట్ చేస్తుంటారు. తాజాగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌ డ్రెస్‌లో డీప్ నెక్ అందాలను చూపిస్తూ ఆమె చేసిన ఫోటో షూట్ కుర్రాళ్లకు సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: nabha natesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X