Nabha Natesh : చెర్రీ పండులా ఊరిస్తున్న ఇస్మార్ట్ పోరి .. వింటర్​‌లో హీట్​ పుట్టిస్తోన్న నభా నటేష్

తెలుగు చిత్ర పరిశ్రమలో కన్నడ భామల హవా ఈనాటిది కాదు.. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి నేటి వరకు కన్నడ కస్తూరిలు తమ అందం, అభినయంతో టాలీవుడ్‌ను ఏలుతున్నారు. ప్రస్తుతం అనుష్క శెట్టి, రష్మిక మందన్న, అషికా రంగనాథ్, శ్రీలీల, ప్రియాంక మోహన్, కృతిశెట్టి తదితర కర్ణాటక హీరోయిన్లు టాలీవుడ్‌ను ఊపేస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు నభా నటేష్. చూడచక్కని అందం, క్యూట్ లుక్స్‌తో తెలుగు ప్రక్షకులకు బాగా దగ్గరయ్యారు నభా.

11 డిసెంబర్ 1995న కర్ణాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం శృంగేరీలో జన్మించారు నభా నటేష్. ఉడిపిలోని ఎన్ఎంఏఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత మోడలింగ్‌లో అడుగుపెట్టారు నభా నటేష్. భరత నాట్యం, వెస్ట్రన్ డ్యాన్స్‌లలో ప్రావీణ్యం సంపాదించారు. స్టేజ్ షోలు, వాణిజ్య ప్రకటనలతో దూసుకెళ్తున్న నభా జీవితాన్ని ప్రకాష్ బెలావడి అనే దర్శకుడు మలుపు తిప్పారు.

Nabha Natesh PhotoShoot With red color dress Her latest photos here

కన్నడ ఇండస్ట్రీ ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన నభా నటేష్‌కు తొలి చిత్రమే శాండిల్‌వుడ్ అగ్ర కథానాయకుడు శివరాజ్ కుమార్ సరసన నటించే అవకాశం దక్కింది. 19 ఏళ్ల వయసులో ఆమె నటించిన చిత్రమే వజ్రకాయ. ఈ సినిమా ఏకంగా 100 రోజులు ప్రదర్శింపబడటంతో పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో తొలి చిత్రంతోనే లక్కీ హ్యాండ్ అనిపించుకున్నారు నభా. ఆ వెంటనే సాహెబాలో నటించిన ఆమె‌ .. 2018లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించారు.

ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్ కళ్లలో పడిన నభా నటేష్ .. ఆయన దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌‌లో ఛాన్స్ ఇచ్చారు. ఇందులో నటన, డ్యాన్స్, డైలాగ్‌లలో ఇరగదీసిన నభా నటేష్ టాలీవుడ్‌లో తొలి బ్రేక్ అందుకున్నారు. ఈ దెబ్బతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో బలంగా జెండా పాతుదుందని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత నభా నటేష్ చేసిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో, డార్లింగ్ వంటి చిత్రాలు దారుణ పరాజయాన్ని మూటకట్టుకున్నాయి.

ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూలో హీరోయిన్‌గా నటిస్తున్న నభా నటేష్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తరచుగా తన వ్యక్తిగత వివరాలు, సినిమాల డిటెయిల్స్‌ను అప్‌డేట్ చేస్తుంటారు. తాజాగా రెడ్ కలర్ గౌనులో డీప్ నెక్ అందాలను చూపిస్తూ ఆమె చేసిన ఫోటో షూట్ కుర్రాళ్లకు సెగలు రేపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: nabha natesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X