Photos: ఇస్మార్ట్ పోరి చీరకట్టు సింగారం.. నాభి అందాలతో నభా నటేష్!

కాలం ఎంత మారినా.. పాశ్చాత్య సంస్కృతి భారతదేశంపై దండయాత్ర చేస్తున్నా.. చీర తన అందాన్ని, గౌరవాన్ని కాపాడుకుంటూ వస్తోంది. ఎన్ని మోడ్రన్ డ్రెస్సులు వచ్చినా చీరలో కనిపించినంత అందంగా అమ్మాయిలే మరే డ్రెస్‌లోనూ కనిపించరంటే అతిశయోక్తి కాదు. తెరపై బికినీ వంటి డ్రెస్సులు వేసుకున్నా చాలా మంది హీరోయిన్లకు చీర అంటే పంచ ప్రాణాలు. తాజాగా చీర విశిష్టత గురించి చెప్పుకొచ్చారు సినీ నటి నభా నటేష్. ఈ వివరాల్లోకి వెళితే..

11 డిసెంబర్ 1995న కర్ణాటకలోని శృంగేరీలో జన్మించారు నభా నటేష్. ఉడిపిలోని ఎన్ఎంఏఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ వైపు వచ్చిన నభా.. భరత నాట్యం, వెస్ట్రన్ డ్యాన్స్‌లలో శిక్షణ తీసుకున్నారు. ప్రకాష్ బెలావడి అనే జాతీయ అవార్డ్ అందుకున్న దర్శకుడు ఈమె కెరీర్‌ను మలుపు తిప్పారు.

Nabha Natesh PhotoShoot With saree Her latest photos here

19 ఏళ్ల వయసులో కన్నడ అగ్ర కథానాయకుడు శివ రాజ్ కుమార్ హీరోగా వచ్చిన వజ్రకాయలో హీరోయిన్‌గా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమాలో 100 రోజులు ప్రదర్శింపబడటంతో పాటు వసూళ్ల వర్షం కురవడంతో తొలి చిత్రంతోనే నభా నటేష్ లక్కీ హ్యాండ్ అనిపించుకున్నారు. తర్వాత సాహెబాలో నటించిన నభా నటేష్‌.. 2018లో సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే మూవీ ద్వారా తెలుగు వారిని పలకరించారు.

అనంతరం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్‌ ఈమెకు బ్రేక్ ఇచ్చింది. డ్యాన్సులు, నటనలో ఇరగదీసిన నభా నటేష్ రాబోయే రోజుల్లో దున్నేస్తారని అంతా అనుకున్నారు. ఆ తర్వాత చేసిన డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో, డార్లింగ్ వంటి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే దాదాపు ఏడాది పాటు నభా నటేష్ కనిపించకపోవడంతో ఆమెకు ఏమైందా అని అభిమానులు షాక్ అయ్యారు. తనకు యాక్సిడెంట్ జరిగిందని.. ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో కొన్ని సర్జరీలు కూడా చేయాల్సి వచ్చిందని నభా తెలిపారు. ప్రమాదం కారణంగా శారీరకంగా, మానసికంగా ఎంతో బాధను అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూలో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె తరచుగా తన ఫోటోలను అప్‌డేట్ చేస్తుంటారు. తాజాగా చంద్రకాంత కలర్ శారీలో నభా నటేష్ నడుము, నాభి అందాలను ఆరబోశారు. అంతేకాదు.. చీర అంటే ఆరు గజాల గుడ్డ ముక్క కాదని మూడు తరాల నృత్యమని ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: nabha natesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X