నల్లచీరలో నభా నటేశ్ వయ్యారాలు.. గ్లామర్ ట్రీట్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే!
నన్ను దోచుకుందువంటే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల భామ నభా నటేష్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని అమ్మడికి కూడా మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. ఇక దీని తరువాత నభా కుర్రహీరోలకు సరిగ్గా సరిపోవడంతో వరుసగా ఆమెకు అవకాశాలు తలుపు తట్టాయి.
ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ నభాకు భారీ విజయాన్ని అందించింది. తెలంగాణ భాషలో పిల్ల.. రామ్ ను తిడుతుంటే కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో ఈ చిన్నది ఉంటుంది అనుకున్నారు. కానీ, అమ్మడికి ఒక్క హిట్ అందలేదు. డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ , మ్యాస్ట్రో లాంటి సినిమాలు చేసినా విజయం మాత్రం అందుకోలేకపోయింది.

ఇక మధ్యలో నభా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అవకాశాలు రాక కనిపించలేదు అనుకున్నారు కానీ .. ఆమె ఒక ప్రమాదానికి గురి కావడం వలన కొన్ని నెలలు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక రెస్ట్ తరువాత బ్యూటీ సోషల్ మీడియాను షేక్ చేయడం మొదలుపెట్టింది. వరుస ఫోటో షూట్స్ తో అందాల ఆరబోతకు నేను సిద్ధం అని చెప్పుకుంటూ వచ్చింది. అకేషన్ ను బట్టి లోకేషన్ చూసుకొని ఫోటోషూట్స్ చేస్తూ మెప్పిస్తుంది.

ఇక తాజాగా అమ్మడు నల్ల చీరలో నల్ల కలువగా మెరిసింది. ఎండాకాలం వేసవి తాపాన్ని తట్టుకోవడానికి కాటన్ చీరను కట్టుకొని.. కుర్రాళ్లకు హీట్ పెంచేసింది. నల్లని చీరలో పాలరాతి దేహంతో నడుమును చూపిస్తూ కుర్రాళ్లకు మతి పోయేలా చేసింది. తెల్లంచు నల్ల చీరలో పదహారణాల పడుచు పిల్లలా నభా అందం అభిమానులను కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇకపోతే ప్రస్తుతం నభా.. నిఖిల్ సరసన స్వయంభులో నటిస్తోంది. ఇక ఈ సినిమాపై ఈ చిన్నది చాలా ఆశలే పెట్టుకుంది. ఈ సినిమా కనుక హిట్ అయితే.. అమ్మడును ఆపడం కష్టమే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.


Click it and Unblock the Notifications











