Don't Miss!
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- News Ys Jagan Attack case: జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం..!
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
షూటింగ్‌కు రెడీ అవుతున్నా.. నభా నటేష్ వీడియో వైరల్
నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ నిజంగానే తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. ఈ ఒక్క చిత్రంతో టాలీవుడ్లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అందం, ప్రతిభ ఉన్న నభా నటేష్‌కు యూత్‌లో భారీగా క్రేజ్ ఏర్పడింది. ఇలా వచ్చిన క్రేజ్ పూరి జగన్నాథ్ కంట్లో పడింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ కన్నడ భామకు ప్రస్తుతం టాలీవుడ్లో భారీగానే క్రేజ్ ఉంది.
ఇక నభా చేతిలో ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రం ఒకటి ఉంది. ఈ మధ్యే సినిమా షూటింగ్లో పాల్గొంది. మొత్తానికి ఆ మూవీని పూర్తి చేసేసింది. కరోనా, లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ షెడ్యూల్‌ను రీసెంట్‌గానే కంప్లీట్ చేశారు. తాజాగా మరో చిత్రానికి సంబంధించిన షూటింగ్లో నభా పాల్గొనబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాబోతోన్న ఈ చిత్రంలో నభా నటేష్ ఓ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ మధ్యే షూటింగ్ ప్రారంభించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, సోనూ సూద్ వంటివారు నటిస్తున్నారు. సోనూసూద్ ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు చిత్రయూనిట్ ఘనంగా సన్మానించింది. ఈ మేరకు వీడియో కూడా తెగ వైరల్ అయింది. తాజాగా ఈ మూవీ షూటింగ్లో పాల్గొనబోతోన్నట్టు నభా నటేష్ తెలిపింది. నాకు తెలిసి అందరూ తమ తమ పనుల్లో బిజీ అయి ఉంటారు. కానీ అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నానని నభా చెప్పుకొచ్చింది.