twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షూటింగ్‌కు రెడీ అవుతున్నా.. నభా నటేష్ వీడియో వైరల్

    |

    నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్ నిజంగానే తెలుగు ప్రేక్షకుల మనసును దోచేసింది. ఈ ఒక్క చిత్రంతో టాలీవుడ్‌లో నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అందం, ప్రతిభ ఉన్న నభా నటేష్‌కు యూత్‌లో భారీగా క్రేజ్ ఏర్పడింది. ఇలా వచ్చిన క్రేజ్ పూరి జగన్నాథ్ కంట్లో పడింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ కన్నడ భామకు ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీగానే క్రేజ్ ఉంది.

    ఇక నభా చేతిలో ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రం ఒకటి ఉంది. ఈ మధ్యే సినిమా షూటింగ్‌లో పాల్గొంది. మొత్తానికి ఆ మూవీని పూర్తి చేసేసింది. కరోనా, లాక్ డౌన్ వల్ల వాయిదా పడ్డ షెడ్యూల్‌ను రీసెంట్‌గానే కంప్లీట్ చేశారు. తాజాగా మరో చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో నభా పాల్గొనబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రాబోతోన్న ఈ చిత్రంలో నభా నటేష్ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.

    Nabha Natesh Ready to join In Alludu Adhurs Shooting

    ఈ మధ్యే షూటింగ్ ప్రారంభించిన ఈ మూవీలో ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, సోనూ సూద్ వంటివారు నటిస్తున్నారు. సోనూసూద్ ఈ మూవీ షూటింగ్‌లో జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు చిత్రయూనిట్ ఘనంగా సన్మానించింది. ఈ మేరకు వీడియో కూడా తెగ వైరల్ అయింది. తాజాగా ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతోన్నట్టు నభా నటేష్ తెలిపింది. నాకు తెలిసి అందరూ తమ తమ పనుల్లో బిజీ అయి ఉంటారు. కానీ అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆశిస్తున్నానని నభా చెప్పుకొచ్చింది.

    English summary
    Nabha Natesh Ready to join In Alludu Adhurs Shooting, Sooo excited to have gotten back to work M sure everyone is been doing what you have been wanting to do . But Please make sure u are taking all the precautions and staying safe Bye
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X