ఓ వైపు భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్ రూమర్స్? రామ్ పోతినేనిపై ఇష్టాన్ని బయటపెట్టిన మరో హీరోయిన్!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేలు ఇటీవలి కాలంలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సంగతి తెలిసిందే. వారిద్దరూ ప్రేమలో ఉన్నారని, సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో రకరకాలుగా గాసిప్స్ వస్తున్నాయి. వీటిని రామ్ పోతినేని ఖండించినప్పటికీ పుకార్లు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలోనే రామ్ పోతినేనిపై ఇష్టాన్ని, అభిమానాన్ని బయటపెట్టారు మరో హీరోయిన్. ఈ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో 20 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు రామ్ పోతినేని. తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో తనకంటూ సెపరేట్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. అందరు హీరోలపై వచ్చినట్లుగానే కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు రామ్ పైనా ఎన్నో పుకార్లు వచ్చాయి. అయితే హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో రామ్ రిలేషన్‌లో ఉన్నట్లుగా ఊహాగానాలు వినిపించడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్స్ వచ్చాయి.

Nabha Natesh Reveals Her Admiration For Ram Pothineni Amid Dating Rumours With Bhagyashri Borse

రామ్ పోతినేని, భాగ్య శ్రీలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న లోకేషన్స్, బ్యాక్‌గ్రౌండ్స్ అన్ని ఒకేలా ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అలాగే ఈ సినిమాలో స్వయంగా రామ్ ఓ పాట రాయడంతో అది భాగ్య శ్రీ గురించేనంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. గతంలో విజయ్ దేవరకొండ- రష్మికలు రిలేషన్‌లో ఉన్నట్లు ఊహాగానాలు రావడం వీటిని వారిద్దరూ ఖండించడం జరిగింది. అయితే వీరిద్దరూ షేర్ చేసిన ఫోటోలలోని గదులు, హోటల్స్, లోకేషన్స్ అన్నీ ఒకేలా ఉండటంతో అభిమానులు షాక్ అయ్యారు. కాలక్రమంలో విజయ్- రష్మికలు ప్రేమలో ఉన్నారని బయటి ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు అదే విషయాన్ని రామ్, భాగ్యశ్రీలకు కూడా లింక్ పెడుతున్నారు నెటిజన్లు.

అటు రామ్ పోతినేనిపై తన ఇష్టాన్ని పలుమార్లు బయటపెట్టారు భాగ్యశ్రీ. ఇటీవల రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ తెలియజేసిన ఈ ముద్దుగుమ్మ.. మీలోని ప్రతిభ, ఎనర్జీ చూసి షాక్ అవుతుంటా. మీలాంటి గొప్ప వ్యక్తి నా పక్కన మంచి స్నేహితుడు ఉన్నందుకు నేనెంతో అదృష్టవంతురాలిని అని రాసుకొచ్చింది భాగ్యశ్రీ.. ఈ పోస్ట్ అనేకా అనుమానాలకు తావిచ్చింది. అయితే భాగ్యశ్రీతో ముడిపెడుతూ వస్తున్న రూమర్స్‌పై గతంలోనే రామ్ పోతినేని క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి ముందే పాట రాశానని, అప్పటికీ హీరోయిన్ ఎవరో కూడా తెలియదని రామ్ క్లారిటీ ఇచ్చారు.

ఇదిలాఉండగా.. తాజాగా ఓ హీరోయిన్ రామ్ పోతినేనిపై అభిమానాన్ని బయటపెట్టారు. ఆమె ఎవరో కాదు.. నభా నటేష్. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం నాగబంధం, స్వయంభు సినిమాలలో నటిస్తున్నారు. వీటిపైనే నభా నటేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాగబంధం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో పనిచేసిన హీరోలు, దర్శకుల గురించి చెప్పమని యాంకర్ అడగ్గా.. నభా నటేష్ ఒక్కొక్కరి గురించి చెప్పారు. ఈ క్రమంలోనే హీరో రామ్ పోతినేని ప్రస్తావన వచ్చింది.

రామ్‌లో చాలా కంటెంట్ ఉంది. తను ఎవరు? తన జీవితం ఏంటీ? అనే దాని గురించి ఆయనకు బాగా తెలుసు. నేను ఏం చేయగలను అనే దానిపై రామ్‌కి క్లారిటీ ఉంది. అందుకే ఆయనను నేను అభిమానిస్తానని నభా నటేష్ తెలిపారు. అలాగే హీరో నితిన్ గురించి చెబుతూ.. ఆయన సెట్‌లో చాలా కామ్‌గా ఉంటారు. నితిన్ సార్‌తో సినిమా చేసేటప్పుడు కోవిడ్ ఉంది. సెట్‌లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేశాం. నాకు చాలా దూరంగా నిలబడి షాట్ అవ్వగానే మాస్క్ పెట్టుకుని పరుగులు తీసేవారు. సెట్‌లో అందరినీ చాలా ప్రేమగా చూసుకుంటూ, నవ్విస్తూ ఉంటారు అని నభా నటేష్ తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X