ఆ హీరో అంటే నాకు పిచ్చి.. సీక్రెట్ లవ్‌ను బయటపెట్టిన నభా నటేష్
ఇస్మార్ట్ శంకర్‌తో టాలీవుడ్‌లో పాగా వేసిన నభా నటేష్ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. వరుసగా అవకాశాలు దక్కించుకొంటూ స్టార్ హీరోయిన్‌గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు. గ్లామర్ పాత్రలకు ఓటేస్తూనే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా నభ నటేష్ మీడియాతో మాట్లాడూతూ ఓ హీరోపై ఉన్న తన సీక్రెట్ లవ్‌ను బయటపెట్టారు. ఇంతకు ఆ హీరో ఎవరంటే...

నభ నటేష్ కెరీర్ గ్రాఫ్ ఇలా
కన్నడ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న నభ నటేష్‌కు తెలుగులో నన్ను దోచుకొందువంటే చిత్రంతో తెలుగులో అవకాశం లభించింది. అయితే ఇస్మార్ట్ శంకర్‌తోనే తన కెరీర్ గ్రాఫ్ రివ్వును పైకి ఎగిరింది. దాంతో క్రేజీ హీరోయిన్‌గా నభ నటేష్‌కు గుర్తింపు లభించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్‌తో సోలో బతుకే సో బెటర్, బెల్లంకొండ శ్రీనివాస్‌తో అల్లుడు అదుర్స్, నితిన్‌తో అంధాదూన్ లాంటి అవకాశాలు చేజిక్కించకొన్నారు.

గ్లామర్‌గానే కాకుండా మాస్ బీట్లకు
యువ హీరోయిన్ నభ నటేష్ విషయానికి వస్తే.. కేవలం గ్లామర్ హీరోయిన్‌గానే కాకుండా మంచి డ్యాన్సర్‌గా యూత్‌లో గుర్తింపు పొందింది. మాస్ బీట్లకు హుషారుగా వేసే స్టెప్పులతో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నారు. ఇలా మాస్, క్లాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తున్న ఈ యువ తార తన వన్‌సైడ్ లవ్‌ను బయటపెట్టారు.

ఫస్ట్ క్రష్ గురించి నభ నటేష్
ఇలా టాలీవుడ్‌లో దూసుకెళ్తున్న నభ నటేష్‌ను ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా అని అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా జవాబు చెప్పింది. తనకు కాలేజ్ డేస్‌లో ఓ సీక్రెట్ లవ్ ఉంది. షారుక్ ఖాన్ అంటే నాకు పిచ్చి ప్రేమ. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రంలో ఆయనను చూసి తొలిసారి నేను ప్రేమలో పడ్డాను అని చెప్పింది.

షారుక్ ఖాన్ అంటే పిచ్చి
దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రం తర్వాత షారుక్ ఖాన్ అంటే చెప్పలేనంత ఇష్టం కలిగింది. కుచ్ కుచ్ హోతా హై లాంటి చిత్రాలను ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. కాలేజ్ డేస్‌లో హీరోలపై అలాంటి క్రష్ ఉండటం సహజమే. కానీ బాలీవుడ్ బాద్షా అంటే నాకు ఇప్పటికీ చెప్పలేనంత ఇష్టం అని చెప్పారు.
Recommended Video

షారుక్‌తో నటించాలని ఉంది
ఇప్పటికైనా నా అభిమాన నటుడితో నటించాలనే కోరిక ఉంది. అవకాశం వస్తే వదులుకోను. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని నభా నటేష్ చెప్పారు. నాకు మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటే వాళ్లంటే ఇష్టం. ఇప్పుడు ఉత్సాహం, సరదాగా ఉండే వారినే ఇష్టపడుతాను అని నభా నటేష్ చెప్పారు.


Click it and Unblock the Notifications











