రవితేజకు హీరోయిన్‌గా లేటెస్ట్ సెన్సేషన్!
సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే చిత్రం నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యాంగా డెబ్యూ హీరోయిన్ నభా నటేష్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. చలాకి నటనతో మెప్పిస్తోందని నభా నటేష్ కు ప్రశంసలు దక్కుతున్నాయి.
తాజగా నభా నటేష్ క్రేజీ ఆఫర్ అందుకుందని వార్తలు వస్తున్నాయి. నభా నటేష్ రవితేజ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. విఐ ఆనంద్ దర్శత్వంలో తెరకెక్కే రవితేజ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో నభా నటేష్ ని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం రావలసి ఉంది.

నన్ను దోచుకుందువటే ప్రీరిలీజ్ ఈవెంట్ లో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ చిత్రం విడుదల కాగానే దర్శక నిర్మాతలంతా నభా నటేష్ కోసం మా ఆఫీస్ కు ఫోన్ చేస్తారని చెప్పాడు. ఇప్పుడు అదే జరుగుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











