బుల్లి మేకప్ ఆర్టిస్ట్.. నభా నటేష్ వీడియో వైరల్
నభా నటేష్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. అభిమానులతో ముచ్చటిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ఉంటుంది. సినిమా అప్డేట్స్ పర్సనల్ విషయాలను చెబుతూ సందడి చేస్తూ ఉంటుంది. లాక్డౌన్‌లో నభా నటేష్ తనలోని ప్రతిభను బయటపెట్టేసింది. నటించడమే కాదు తనలోనూ ఓ అందమైన ఆర్టిస్ట్ ఉన్నాడని, తాను గీసిన బొమ్మలను సోషల్ మీడియా వేదికగా ప్రదర్శించింది.
నభా గీసిన బొమ్మలను చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతే కాకుండా ఆ మధ్య సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ తెలుగులో ముద్దు ముద్దు మాటలు మాట్లాడేసింది. ఈ మధ్యే తెలుగు నేర్చుకుంటున్నానని, అర్థం అవుతుంది కానీ పూర్తిగా మాట్లాడలేను అని తెలిపింది. తాజాగా నభా ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది. ఇంట్లో చిన్న పిల్లలు అల్లరి ఎలా చేస్తారో శాంపిల్‌గా ఈ వీడియోను వదిలింది.

నభాకు అసలు సిసలైన మేకప్ ఆర్టిస్ట్ దొరికినట్టుంది. నభా ఇంట్లో ఉన్న బుల్లి ఆర్టిస్ట్ నభాను రెడీ చేసింది. ఇందులో భాగంగా లిప్ స్టిక్‌ను మొహం అంతా పూసినట్టు కనిపిస్తోంది. ఇక జుట్టును కూడా డ్రైయింగ్ మిషన్‌తో ఆరబెట్టేసింది. బుల్లి మేకప్ ఆర్టిస్ట్ తనను రెడీ చేస్తోన్న దృశ్యాన్ని నభా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నభా ప్రస్తుతం చెక్, అల్లుడు అదుర్స్, అంధాదున్ చిత్రాలతో బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











