హైదరాబాద్ స్లాంగ్‌లో అదరగొట్టబోతున్న హీరోయిన్!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో ఇస్మార్ట్ శంకర్ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థ పూరికనెక్ట్స్ బ్యానర్ లో నిర్మించనున్నారు. సీనియర్ హీరోయిన్ చార్మి ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించనుంది. పూరి జగన్నాథ్, హీరో రామ్ కెరీర్ కు ఈ చిత్రం చాలా కీలకం. వరుస పరాజయాల్లో ఉన్న వీరిద్దరూ ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నారు.
ఈ చిత్రంలో యంగ్ హీరోయిన్లు నభా నటేష్, నిధి అగర్వాల్ రామ్ కు జోడిగా నటిస్తున్నారు. నన్ను దోచుకుందువటే చిత్రంతో నభా నటేష్ టాలీవుడ్ కు పరిచయం అయింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా నటేష్ పాత్ర గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో హైదరాబాదీ స్లాంగ్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

డైలాగ్స్ బాగా వచ్చేందుకు నభా ప్రస్తుతం హైదరాబాదీ యాసని ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మెహబూబా లాంటి ప్లాప్ మూవీ తర్వాత పూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీనితో విజయం కోసం కాస్త గట్టిగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











