కుర్ర హీరోలతో రొమాన్స్ చేసేందుకు నభా నటేష్ ప్లాన్.. ఆలోచన భలే ఉందే!
కాసింత గ్లామర్, దానిని అందరికీ చూపించే ధైర్యం ఉండాలి గానీ ఈ రోజుల్లో సినిమా ఛాన్సులు రావడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే వచ్చిన ఆ ఛాన్సును నిలబెట్టుకోవడమే క్లిష్టమైన స్టెప్. కుర్ర హీరోయిన్ల విషయంలో నైతే ఇది మరీ ఎక్కువ. అందాల భామలకు ఇలా అవకాశం ఇచ్చి అలా వేరొకరి వైపు చూస్తుంటారు దర్శక నిర్మాతలు. దీంతో ఇండస్ట్రీకి ఓ నయా భామ ఇక్కడ నిలదొక్కుకోవాలంటే కొన్ని మ్యాజిక్కులు, మరికొన్ని లాజిక్కులు ఉపయోగించాల్సిందే. ఈ విషయాన్ని బాగా గ్రహించినట్లుంది యంగ్ అండ్ గ్లామర్ బ్యూటీ నభా నటేష్. ఈ మేరకు ఆమె చేసిన మ్యాజిక్ ఇదేనని చెప్పుకుంటున్నారు కొందరు. ఆ వివరాలు చూద్దామా మరి.

హీరోయిన్స్ ఫస్ట్ క్వాలిటీ
తమ తమ వయసు ఎంతున్నా గ్లామర్‌గా కనిపించడమే సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ. అయితే కొన్ని సందర్భాల్లో కుర్ర హీరోలతో రొమాన్స్ చేయించాలంటే హీరోయిన్ వయసు కూడా పరిగణలోకి తీసుకుంటారు ఫిలిం మేకర్స్. కాబట్టి వయసు విషయంలో నభా నటేష్ సరికొత్తగా ఆలోచించి ఈ రకంగా నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

వయసు బాగా తగ్గించేసి మరీ
వయసు బాగా తగ్గించేసి మరీ తన బయోడాటా అందరి ముందుంచింది కర్ణాటక సుందరి నభా నటేష్. వికీ పీడియాలో నభా నటేషా వయసు 23 ఏళ్లుగా కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం ఓ కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత తెలుగులో నన్ను దోచుకుందువటే అంటూ ఎంట్రీ ఇచ్చింది. ఈ లెక్కన నభా సినీ గడప తొక్కింది 19 ఏళ్ల వయసులోనే అన్నమాట.

ఆ ఛాన్సే లేదు
నభా మంగళూరులో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిందని తెలుస్తోంది. అంటే 19 ఏళ్లకు ఎలాగూ ఇంజనీరింగ్ పూర్తయ్యే ఛాన్స్ లేదు. దీనిని బట్టి నభా నటేష్ కావాలనే తన వయసును తక్కువగా చూపుతోందని టాక్ వినిపిస్తోంది. ఆమె 24 ఏళ్లకు సినిమాల్లోకి వచ్చిందని, ఆ లెక్కన ఆమె వయసు ప్రస్తుతం 29 ఏళ్లని సినీ వర్గాలు ముచ్చటలాడుకుంటున్నాయి.

కుర్ర హీరోలతో రొమాన్స్ కోసమే..
మరీ 29 ఏళ్లంటే ముదురు భామ అనుకొని కుర్ర హీరోలు తనతో సినిమాలు చేసేందుకు ముందుకు రారేమోననే నభా ఈ లాజిక్కు ఉపయోగించిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వికీపీడియాలో ఇలా వయసు తగ్గించుకొని వేయమని ఆమెకు ఛార్మినే సలహా ఇచ్చిందనేది కొసమెరుపు. ఏదేమైనా సినిమా ఇండస్ట్రీలో కొనసాగేందుకు, కుర్ర హీరోలతో కంటిన్యూస్ గా రొమాన్స్ చేసేందుకు నభా ఉపయోగించిన లాజిక్ కరెక్ట్ అనే వాదన కూడా వినిపిస్తోంది.

ఇస్మార్ట్ శంకర్‌లో రామ్‌తో
ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ సరసన చిందులేస్తోంది నభా నటేష్. ఈ చిత్రాన్ని పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చిత్రంలో మరో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇటీవలే చిత్రయూనిట్ రిలీజ్ చేసిన దిమాక్ ఖరాబ్ అనే పాట స్టిల్స్‌లో నభా కుర్రకారుకు పిచ్చెక్కే అందంతో ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











