చీరకట్టుతో నభా నటేష్ అదిరే అందాలు.. ఇస్మార్ట్ పోరి హల్‌చల్

నేడు జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా దాదాపు హీరోయిన్లు అందరూ చీరలో దర్శనమిస్తున్నారు. తద్వారా చేనేత వస్త్రాలకు ప్రాధాన్యం పెంచాలని చూస్తున్నారు. దాని వల్ల చేనేత పరిశ్రమకు ఆదరణ లభించి, కార్మికులకు ఉపాధి కలుగుతుందన్న ఆశ. చేనేత చీరకట్టి అనే పాట ఉండనే ఉంది కదా. అదే స్టైల్లో కొందరు హీరోయిన్లు చీరలో కనబడి మతులు పోగొడుతున్నారు. అందులో ఓ చిన్నది మాత్రం తన అందాలతో అందర్నీ మటాష్ చేస్తోంది. ఆమె మరెవరో కదా అందాల చిన్నది నభా నటేష్.

నన్ను దోచుకుందవటే చిత్రంతో పరిచయమైన ఈ చిన్నది మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకలను కట్టిపడేసింది. సినిమా ఫలితం సంగతి ఎలా ఉన్నా నభాకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఆపై ఇస్మార్ట్ శంకర్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. అందులోనూ నభాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. వరంగల్ పోరీ, ఇస్మార్ట్ పోరీగా భారీ పాపులార్టీని సొంతంచేసుకుంది. మాస్ ఆడియెన్స్‌కు నభా బాగా దగ్గరైంది. తాజాగా ఇలా చీరలో కనబడి అందర్నీ కట్టిపడేసింది.

Nabha Natesh Wear Saree For Handloom Day
Nabha Natesh Wear Saree For Handloom Day

నేటి చేనేత దినోత్సవం సందర్భంగా బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా హీరోయిన్లు చీరలో దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో నభా కట్టుకున్న చీర, ఇచ్చిన పోజులు కుర్రకారుకు మతిని పోగొడుతున్నాయి. చీరలో ఉన్న నభా ఫోటోలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తోన్న సోలో బ్రతుకే సో బెటర్ చిత్రంతో నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన నో పెళ్లి పాటలో నభా ఓ రేంజ్‌లో అదరగొట్టింది. చూస్తుంటే నభాకు మరో హిట్ గ్యారెంటీ అని అనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X