కరోనా ఎఫెక్ట్ : స్వీయ నిర్భందంలోకి యంగ్ హీరోయిన్!
కరోనా ధాటికి ప్రపంచమంతటా గడగడలాడిపోతోంది. భారతదేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 140 మందికి కరోనా లక్షణాలు బయటపడ్డాయని ప్రభుత్వం ప్రకటించింది. మన రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు మందికి కరోనా సోకినట్టు తేలింది.
పలు రాష్ట్రాల్లో థియేటర్స్, మాల్స్, స్కూల్స్, పబ్స్, క్లబ్స్ వంటి వాటిని మూసి వేశారు. చిత్ర సీమ మొత్తం మూగబోయింది. పదిహేను రోజుల షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేశారు. దీంతో సెలెబ్రిటీలంతా ఇంటి పట్టునే ఉంటారు. బయటకు వెళ్లొద్దు ఇంట్లోనే ఉండాలని, స్వీయ నిర్భందంలోకి వెళ్లండని సూచిస్తున్నారు.

కమెడియన్ ప్రియదర్శి.. జార్జియా నుంచి వచ్చాక స్వీయ నిర్భందంలోకి వెళ్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. కరోనా వ్యాప్తి చెందుకుండా అందరూ సహకరించాలని, ఇంట్లోనే ఉండండంటూ అందరికీ సూచించాడు. ఈ క్రమంలోనే యంగ్ హీరోయిన్ నభా నటేష్ సైతం స్వీయ నిర్భందంలోని వెళ్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్, పిక్ తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











