శోభిత ధూళిపాల ఫోటోలు ట్రెండింగ్.. ఈ లుక్ లో నాగ చైతన్య కాబోయే భార్యని గుర్తుపట్టగలరా?
సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు వారి పెళ్లిళ్లు వంటివి కూడా మంచి ఆసక్తికరంగానే ఉంటాయని చెప్పాలి. అలాగే ఒక్క పెళ్లే అనుకుంటే కొందరు రెండు పెళ్లిళ్లు ఇంకొందరు మూడేసి పెళ్లిళ్లు కూడా చేసుకునే వారు కూడా ఉన్నారు. అయితే రెండు పెళ్లిళ్లు అనేవి మాత్రం మన తెలుగు సినిమాలో ఎప్పుడు నుంచో చాలా మంది స్టార్స్ నుంచి ఉన్నాయని చెప్పాలి.
కాగా ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న సీనియర్ స్టార్స్ లో అక్కినేని మన్మథుడు నాగార్జున కూడా ఉండగా తన ఫార్మాట్ లోనే తన వారసుడు నాగ చైతన్య కూడా ఇపుడు రెండో పెళ్ళికి సిద్ధం అవ్వడం అనేది చర్చకు దారి తీసింది. కాగా అక్కినేని నాగ చైతన్య మొదటి పెళ్లి స్టార్ హీరోయిన్ సమంతతో జరిగిన సంగతి తెలిసిందే. మరి వీరి వివాహ బంధం వారి పర్శనల్ కారణాలు మూలాన పూర్తి స్థాయిలో కొనసాగలేకపోయింది.

దీనితో ఇక నాగ చైతన్య మరో పెళ్ళికి సిద్ధం అయ్యాడు. తన తోటి నటి అది కూడా తెలుగు అమ్మాయి అయినటువంటి శోభిత ధూళిపాళని నాగ చైతన్య పెళ్లి చేసుకోనున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. కుటుంబం కూడా ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడి చేయడంతో ఇపుడు ఈ నవ జంట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు శోభిత ధూళిపాళ సంబంధించి చాలానే కొత్త కొత్త విషయాలు బయటకి వస్తున్నాయి.
ఈమెని తెలుగు ఆడియెన్స్ గట్టిగా చెప్పాలి అంటే "గూఢచారి" నుంచి తెలుగు ఆడియెన్స్ కి పరిచయం ఉండొచ్చు. మరీ సినిమా సర్కిల్స్ తెలిస్తే హిందీ సినిమాల్లో ఆమె నటించింది అని తెలిసి ఉండొచ్చు. కానీ ఈమెని మన ఇప్పుడు చూస్తున్న ముఖం వేరు ఆమె క్యారీ స్టార్టింగ్ లో ఉన్న ముఖం వేరు అని చాలా తక్కువమందికి తెలిసి ఉండొచ్చు అని చెప్పాలి.
చాలా మంది స్టార్ హీరోయిన్స్ తమ కెరీర్ స్టార్టింగ్ లో ఉన్న లుక్స్ తో ఎవరూ కొనసాగలేదు. మధ్యలో కొన్ని మార్పులు చేయించుకొని ఇండస్ట్రీలో మరింత ఆదరణ తెచ్చుకునే ప్రయత్నం చేసారు. కాగా శోభిత కూడా ఇలానే చేసింది అని చెప్పాలి. ఆమెవి కొన్ని పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇందులో మాత్రం ఈమెని చూస్తే అసలు గుర్తు పట్టలేని విధంగా ఉందని చెప్పాలి.
ఇప్పుడు ఉన్న లుక్ ని అప్పుడు ఉన్న లుక్ ని చూస్తే తప్పకుండా ఎవరైనా షాక్ అవ్వాల్సిందే అని చెప్పాలి. ఇలా శోభిత పాత ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇటీవల మరో హీరోయిన్ షాకింగ్ మేకోవర్ కూడా వైరల్ గా మారాయి.
ఆమెనే నటి అదితిరావు హైదరి కాగా ఈమెకి సంబంధించిన కొన్ని పాత ఫోటోలు కూడా ఇలానే వైరల్ అయ్యాయి. అందులో కూడా ఈమె అప్పటికీ ఇప్పటికీ గుర్తు పట్టలేని విధంగానే కనిపించింది. కానీ తర్వాత సోషల్ మీడియాలో ఈమె పర్శనల్ గా తీయించేసింది. ప్రస్తుతం అదితి సిద్ధార్థ్ తో పెళ్ళికి సిద్ధం కాగా వీరు అతి త్వరలోనే వివాహంతో ఒకటి కానున్నారు.


Click it and Unblock the Notifications











