Samantha సమంత వంట అంత చెత్తగా.. నాగచైతన్య వైరల్ కామెంట్స్

హీరో నాగచైతన్య - హీరోయిన్​ సమంత ఈ ఇద్దరు విడిపోయి మూడు నాలుగేళ్లు అయిపోతోంది. అయినా వీరికి సంబంధించిన విషయాలపై ప్రేక్షకుల్లో, నెటిజన్లలో ఆసక్తి అస్సలు ఏ మాత్రం తగ్గట్లేదు. ఇంకా ఇంకా పెరుగుతూ పోతుంది. ఒక చిన్న విషయం బయటకు వచ్చినా ఇట్టే చక్కర్లు కొడుతోంది. అలా తాజాగా మరో వార్త బయటకు వచ్చి వైరల్ అవుతోంది. ఇందులో చైతన్య - సమంత వంట వండితే ఎలా ఉంటుందో చెపుతూ షాకింగ్ ఎక్స్​ప్రెషన్స్​తో కనిపించారు. దానికి సంబంధించిన వీడియో తెగ తిరుగుతోంది. పూర్తి వివరాలను స్టోరిలోకి వెళ్లి తెలుసుకుందాం..

ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిలు చేసుకుని తమ అభిమానుల్లో సంతోషాన్ని నింపారు. అంతే త్వరగా కూడా విడాకులు తీసుకుని షాకింగ్ ఇవ్వడంతో పాటు వారిని బాధపెట్టారు కూడా. అలాంటి జంటల్లో నాగ చైతన్య - సమంత ముందు వరుసలో ఉంటారు. కలిసి నటించిన తొలి సినిమాతోనే ఆన్ స్క్రీన్​ కెమిస్ట్రీని ఆఫ్​ స్క్రీన్ కెమిస్ట్రీగా మార్చుకుని ప్రేమలో పడ్డారు. ఎవరూ తెలీకుండా చాలా ఏళ్ల పాటు సైలెంట్​ రిలేషన్​షిప్ మెయిన్​టెయిన్ చేశారు. ఒక్కసారిగా పెళ్లి చేసుకుని సర్​ప్రైజ్ ఇచ్చారు.

Naga Chaitanya Comments on Samantha Cooking Video Goes Viral

ఆ తర్వాత ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ కలిసి సినిమాలు చేస్తూ ముందుకెళ్లారు. కానీ ఏమైందో కానీ ఒకే ఇంట్లో ఉండటం మొదలు పెట్టాక ఒకరి గురించి మరొకరి అసలు నిజస్వరూపాలు తెలిసాయామో కానీ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. బయటకు వాళ్లకు అసలు కారణాన్ని చెప్పకుండానే విడిపోయారు. ఇక ఈ ఇద్దరు విడిపోవడం మొదలు ఇప్పటికీ వీరి అభిమానులు ఏదో ఒక విషయంలో వారిని తలుచుకుంటూనే ఉంటారు. గత జ్ఞాపకాలను కూడా తవ్వుకుని బయటకు తీసుకొస్తుంటారు. డివొర్స్ తీసుకున్న సమంత - చైతూ సైలెంట్ మెయిన్ టెయిన్​ చేస్తే ఫ్యాన్స్ మాత్రం వీరి పేర్లతో జపం చేస్తూనే ఉంటారు.

అలా తాజాగా ఓ పాత వీడియోను నెట్టింట్లో నుంచి తవ్వుకుని బయటకు తీసుకొచ్చారు. ఇందులో ఆహా వేదికగా సామ్​ హోస్ట్​గా వ్యవహరించిన షోకు గెస్ట్​గా నాగ చైతన్య వచ్చారు. సామ్​ మాట్లాడుతూ.. 'నా మొగుడు మంచి మూడ్​లో ఉన్నాడు' అంటూ మొదలుపెడుతుంది. దానికి చైతూ.. 'నేనెప్పుడు ఫుల్ కూల్​ మూడ్​లోనే ఉంటాను' అంటూ బదులిచ్చారు.

Naga Chaitanya Comments on Samantha Cooking Video Goes Viral

ఆ తర్వాత సామ్​.. 'నా వంటకు ఎన్ని పాయింట్లు ఇస్తారు?' అనగా చైతూ షాక్ అయిపోతారు. చెత్తగా వండుతావ్ అన్నట్టుగా ఎక్స్​ప్రెషన్స్​ పెట్టారు. అనంతరం 'ఇంటిని నేనెలా హ్యాండిల్ చేస్తాను' అని మళ్లీ సామ్ అడగగా.. 'నువ్వా అసలు చేయగలవా' అంటూ మరో రిప్లై ఇచ్చారు చైతూ. అలా ఈ వీడియోలో సామ్​ను తన మాజీ భర్త చైతన్య సరదాగా ఆటపట్టిస్తూ కనిపించారు. ఆ వీడియోనే ప్రస్తుతం నెట్టింట్లో గిర్రు గిర్రు మంటూ తిరుగుతూ కనిపించింది.

ఇకపోతే సామ్ త్వరలోనే సిటాడెల్ ఇండియన్ వెర్షన్​తో ప్రేక్షకుల ముందుకు రానుండగా చైతూ తండేల్ చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు. చూడాలి మరి వరుస ఫ్లాపుల్లో ఉన్న వీరిద్దరికీ ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X