నాగ చైతన్యకు కాబోయే భార్య శోభిత బ్యాగ్రౌండ్ ఇదే.. ఆమె ఊరు, తండ్రి గురించి తెలిస్తే!
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోన్న హీరోయిన్లలో శోభిత ధూళిపాళ్ల పేరు ఒకటి. అంతలా ఈ అమ్మడి గురించి అటు సోషల్ మీడియాలోనూ, ఇటు న్యూస్ ఛానెళ్లలోనూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనికి కారణం ఈ హీరోయిన్‌ను యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడని ప్రచారం జరుగుతుండడమే. ఈరోజే వీళ్లిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా జరగబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో శోభిత ధూళిపాళ్ల ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి అంతా వెతుకుతున్నారు. మరి ఆ పూర్తి వివరాలను మీరు కూడా చూసేయండి మరి!
నాగ చైతన్యతో లవ్ ట్రాక్
చాలా కాలంగా సినీ రంగంలో తనదైన గ్లామర్, యాక్టింగ్‌తో అలరిస్తోన్న శోభిత ధూళిపాళ్ల వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే కొన్నేళ్లుగా ఈ అమ్మడు యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్యతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే వీళ్లిద్దరూ తరచూ హాలీడే ట్రిప్‌లకు వెళ్తూ యమా ఎంజాయ్ చేస్తున్నారు.

ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అని
సమంత రూత్ ప్రభును పెళ్లి చేసుకున్న నాగ చైతన్య ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే శోభిత ధూళిపాళ్లతో అతడు లవ్ ట్రాక్‌ను నడుపుతున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సర్‌ప్రైజింగ్‌గా ఈరోజు సాయంత్రమే నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ కూడా జరగబోతున్నట్లు న్యూస్ లీకైంది.

మిస్ ఇండియా పోటీల్లో
నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ జరుగుతున్న నేపథ్యంలో అందరూ శోభిత ధూళిపాళ్ల గురించి ఆరా తీస్తున్నారు. ఈ అమ్మడు 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని కొద్దిలో కిరీటాన్ని మిస్ అయింది. అలాగే, అదే ఏడాది జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీల్లోనూ భాగం అయింది. తద్వారా శోభితకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా లభించింది.

హీరోయిన్.. తెలుగులోకి
అందంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న శోభితకు సినిమా ఛాన్స్‌లు భారీగా వచ్చాయి. ఇలా 'రామన్ రాఘవ్ 2.0' అనే హిందీ చిత్రంతో యాక్టింగ్ కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 'చెఫ్', 'కళాకంది' వంటి బాలీవుడ్ మూవీల్లో నటించింది. ఈ క్రమంలోనే అడివి శేష్ 'గూఢచారి' మూవీతో శోభిత ధూళిపాళ్ల టాలీవుడ్‌లోకి వచ్చి పలు చిత్రాల్లో నటించింది.
ఆ సిరీస్‌లో.. ఇప్పుడిలా
'గూఢచారి' తర్వాత 'మేజర్' మూవీలో నటించిన శోభిత అనంతరం తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీలతో పాటు 'సితార' అనే హిందీ చిత్రంలోనూ మెప్పించింది. మరీ ముఖ్యంగా శోభిత ధూళిపాళ్ల 'ది నైట్ మేనేజర్' అనే సిరీస్ రెండు సీజన్లలో నటించింది. ఇందులో ఆమె అదిరిపోయే హాట్ షో చేసింది. ఇక, 'మంకీ మ్యాన్' అనే హాలీవుడ్ మూవీనీ చేసింది.

తెలుగు పిల్ల.. బ్యాగ్రౌండ్
శోభిత ధూళిపాళ్ల ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో జన్మించింది. ఆమె తండ్రి వేణుగోపాలరావు మర్చంట్ నేవీ ఇంజనీర్‌గా, ఆమె తల్లి శాంతా కామాక్షి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలుగా పని చేశారు. శోభిత పదహారేళ్ల వరకూ వైజాగ్‌లోనే ఉంది. ఆ తర్వాత ముంబై వెళ్లింది. అక్కడ భరతనాట్యం, కూచిపూడి నేర్చుకుంది. ఆ తర్వాత మోడల్‌గా మారి, ఇప్పుడు హీరోయిన్ అయింది.


Click it and Unblock the Notifications











