ఎంగేజ్‌మెంట్ తర్వాత షాకిచ్చిన శోభిత.. అందులో సమంతను మించిపోయేలా!
మిగిలిన అన్ని సినిమా ఇండస్ట్రీల మాదిరిగా తెలుగులో మాత్రం లోకల్ అమ్మాయిలు పెద్దగా ఆఫర్లను అందుకోవడం లేదు. దీంతో వేరే భాషల్లో ఫేమస్ అవుతున్నారు. అలా ఇటీవలి కాలంలో దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయిన బ్యూటీనే శోభిత ధూళిపాళ్ల. తనదైన సినిమాలతో మెప్పిస్తోన్న ఈ చిన్నది.. వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇక, ఇటీవలే అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని హాట్ టాపిక్ అయిపోయింది. ఈ నేపథ్యంతో తాజాగా శోభిత సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ వదిలింది. వాటిని లేట్ చేయకుండా మీరే చూసేయండి మరి!
మిస్ ఇండియా.. మూవీల్లో
టీనేజ్‌లోనే మోడలింగ్ రంగలోకి అడుగు పెట్టిన శోభిత ధూళిపాళ్ల అందంతో ఫిదా చేసింది. ఈ క్రమంలోనే 2013లో జరిగిన మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని కొద్దిలో కిరీటాన్ని మిస్ అయింది. ఆ తర్వాత 'రామన్ రాఘవ్ 2.0' అనే హిందీ చిత్రంతో నటిగా ఎంటరైంది. అనంతరం 'చెఫ్', 'కళాకంది' వంటి చిత్రాలు చేసి.. 'గూఢచారి' మూవీతో తెలుగులోకి వచ్చింది.

భారీ చిత్రాలు.. ఇంగ్లీష్‌లో
'గూఢచారి' తర్వాత శోభిత ధూళిపాళ్ల మళ్లీ 'మేజర్'తో తెలుగు చిత్రంలో కనిపించినా.. తర్వాత ఆఫర్లు పొందలేదు. కానీ, తమిళంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీలతో పాటు 'సితార' అనే హిందీ చిత్రంలోనూ మెప్పించింది. ముఖ్యంగా 'ది నైట్ మేనేజర్'తో సెన్సేషన్ అయిపోయింది. ఇక, ఇటీవలే శోభిత 'మంకీ మ్యాన్' అనే హాలీవుడ్ మూవీలో నటించి మెప్పించింది.
నిశ్చితార్థం చేసుకుంది
శోభిత ధూళిపాళ్ల కొంత కాలంగా టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్యతో సీక్రెట్‌గా లవ్ ట్రాక్ నడుపుతోంది. కానీ, ఈ విషయం మాత్రం రహస్యంగానే ఉండిపోయింది. అయితే, ఆగస్టు 8వ తేదీన వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసి దీన్ని అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

సోషల్ మీడియాలో బిజీ
తెలుగు అమ్మాయే అయినా హాలీవుడ్ వరకూ ప్రభావాన్ని చూపిస్తూ దూసుకుపోతోన్న శోభిత ధూళిపాళ్ల వరుసగా ఆఫర్లను అందుకుంటోంది. అయినా సోషల్ మీడియాలో సైతం యమా యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా హడావిడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో షేర్ పంచుకుంటోంది.

హాట్ షో.. ఇప్పుడు అవి
శోభిత ధూళిపాళ్ల చాలా కాలంగా అందాలతో హడావిడి చేస్తోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె హాట్ డోస్ పెంచేసి మరీ రచ్చ లేపుతోంది. ఇందులో భాగంగానే తనదైన రీతిలో చూపిస్తూ తీసుకున్న హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శోభిత కొన్ని బోల్డ్ పిక్స్ వదిలి.. అభిమానులకు అందాల విందు ఇస్తోంది.

సమంతను మించేలా
తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల తాజాగా తన సోషల్ మీడియాలో వదిలిన ఫొటోలు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీనికి కారణం నెటిజన్లు ఆమెను సమంతతో పోలుస్తూ చేస్తున్న కామెంట్లే. కొందరు 'సమంత కంటే అందంగా కనిపించాలని ట్రై చేస్తోంది', 'నువ్వు ఎప్పటికీ సమంతను రీప్లేస్ చేయలేవు' అంటూ విమర్శిస్తున్నారు. దీంతో ఈ పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











