Sobhita Dhulipala: అక్కినేని కాబోయే కోడలు కలలు మామూలుగా లేవుగా

Sobhita Dhulipala: బాలీవుడ్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల ఈ అమ్మడు ఎంగేజ్ మెంట్ అక్కినేని వారసుడు నాగచైతన్యతో జరిగిన విషయం తెలిసిందే. ఆనాటి నుంచి ఈ అమ్మడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఆమె ప్రతి విషయం నెట్టింట్లో తెగవైరలవుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత, విషయాలు, తన కెరీర్, తన కలలు గురించి ప్రస్తావించింది. ఆ ఇంట్రెస్టింగ్ అంశాలేంటో మీరు కూడా లూక్కేయండి.

శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ అక్కినేని వారసుడు నాగ చైతన్యతో జరిగిన నాటి నుంచి ఆ ముద్దుగుమ్మ పేరు మారుమోగిపోతోంది. బాలీవుడ్ మూవీస్ తో శోభితా ఫేమస్ అయినప్పటికీ అమ్మడు తెలుగు అమ్మాయే. చిన్నప్పటి నుంచి శోభితకు డ్యాన్స్ అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని గమనించిన తన తల్లిదండ్రులు సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో శిక్షణ ఇప్పించారు. ఇక కాలేజ్ డేస్ లో తన స్నేహితుల ప్రోత్సాహంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది శోభిత. తనని నిత్యం అప్డేట్ చేసుకుంటూ.. ఇండియాలోకి ప్రముఖ మోడల్స్ ఒకరిగా పేరు తెచ్చుకున్నారు.

Naga chaitanya future wife Sobhita Dhulipala s dream was to work as Chief Economist Advisor to the President

ఈ క్రమంలోనే 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది శోభిత. ఆ తరువాత మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ ను సొంతం చేసుకుంది ఈ హాట్ బ్యూటీ. ఆ తరువాత నటనపై ఇంట్రెస్ట్ తో ఈ అమ్మడు 2016లో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇలా విక్కీ విశాల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన 'రామన్ రాఘవ్ 2.0'తో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన శోభితా దూళిపాళ. ఆ తర్వాత 'చెఫ్','కళాకంది'అనే మూవీలో నటించి మెప్పించింది శోభిత.

ఆ తరువాత అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. శోభితా కెరీర్లో .. రామన్‌ రాఘవన్‌ 2.ఓ, మేడ్‌ ఇన్‌ హెవెన్‌, కాలకాండి, ది నైట్‌ మేనేజర్‌, మేజర్‌ వంటి సినిమాలు మంచి పాపులార్టీని తెచ్చిపెట్టాయి. అలాగే.. పలు వెబ్ సిరీస్ ల్లోనూ నటించింది. ఇటీవల పొన్నియన్ సెల్వన్, కల్కి చిత్రంలో నటించింది. అలాగే.. మంకీ మ్యాన్ అనే అమెరికన్ ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించింది. అలాగే మలయాళంలో కురుప్‌ చిత్రంలో నటించి మెప్పించింది. ఇటీవలే ఆమె నటించిన లవ్‌ సితార మూవీ థియేటర్లోకి రాగా, ఈ మూవీ పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది.

Naga chaitanya future wife Sobhita Dhulipala s dream was to work as Chief Economist Advisor to the President

ఇటీవల శోభిత ధూళిపాళ్ళ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ శోభితకు హీరోయిన్‌ కావాలనేది డ్రీమ్‌ కాదంట. తన డ్రీమ్ వేరే ఉండేదట. తాను ఎకనమిస్ట్ కావాలని కలలు కన్నదట శోభిత. రాష్ట్రపతి వద్ద పనిచేయాలని, ప్రెసిడెంట్ కి చీఫ్‌ ఎకనమిస్ట్ అడ్వెయిజర్‌గా ఉద్యోగం చేయాలని కలలు కన్నదట. ఆ డ్రీమ్ ను పుల్ పిల్ చేసుకోవడానికి తాను ఎంతగానో ఫోకస్ చేశాన్నానని తెలిపారు.

తన స్నేహితులంతా.. సినిమాలు, హీరోలు, హీరోయిన్స్ గురించి మాట్లాడితే.. తాను మాత్రం ఆర్బీఐ గవర్నర్‌ రఘురామరాజన్‌, చిదంబరం, శశిథరూర్‌ వంటి ఎకనమిస్ట్, పాలిటిక్స్ గురించి మాట్లాడేదంట. ఈ సమయంలో తనని అందరూ వింతగా చూసేవారనీ, కానీ, అనుకోకుండా తానే విచిత్రంగా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టానని తెలిపింది శోభితా. ఏదిఏమైనా.. ఓ మంచి నటిగా శోభితా గుర్తింపు తెచ్చుకుంది. కోట్లాది ఫ్యాన్స్ సంపాదించుకుంది. త్వ‌ర‌లో శోభిత .. నాగ చైత‌న్య‌(Naga Chaitanya)తో క‌లిసి ఏడ‌డుగులు వేసేందుకు సిద్ధ‌మైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X