Don't Miss!
- News దానం నాగేందర్ కు షాక్ - కాంగ్రెస్ అభ్యర్ది మార్పు..!?
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలెంటెడ్ డైరెక్టర్‌తో నాగ చైతన్య కొత్త ప్రయోగం: RRR ప్రొడ్యూసర్ అదిరిపోయే ప్లాన్
కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు అక్కినేని వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య. ఈ జోష్‌లోనే ఒక దాని తర్వాత ఒకటి ఇలా ప్రాజెక్టులను లైన్లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అతడు 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటించాడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనితో పాటు నాగ చైతన్య.. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం.. అక్కినేని నాగ చైతన్య తాజాగా ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన కిశోర్ తిరుమలతో సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడట. ఈ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన అతి త్వరలో రాబోతుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూనే తీస్తున్నప్పటికీ.. సరికొత్త పంథాలో సాగుతుందని అంటున్నారు. ఇందులో నాగ చైతన్య సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే, అదేంటి అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.
కిశోర్ తిరుమల ఈ ఏడాది రామ్ పోతినేని హీరోగా 'రెడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు. ఈ గ్యాప్‌లోనే నాగ చైతన్య కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తోంది. మరోవైపు, ఈ అక్కినేని హీరో ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నాడు. దాదాపు ఇందులో 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రను చేస్తున్నాడు. తద్వారా బాలీవుడ్‌లోకి ఇలా ఎంట్రీ ఇస్తున్నాడు.