twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టాలెంటెడ్ డైరెక్టర్‌తో నాగ చైతన్య కొత్త ప్రయోగం: RRR ప్రొడ్యూసర్ అదిరిపోయే ప్లాన్

    |

    కొంత కాలంగా వరుస హిట్లను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు అక్కినేని వారసుడు, యువ సామ్రాట్ నాగ చైతన్య. ఈ జోష్‌లోనే ఒక దాని తర్వాత ఒకటి ఇలా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అతడు 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటించాడు. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనితో పాటు నాగ చైతన్య.. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది.

    తాజా సమాచారం ప్రకారం.. అక్కినేని నాగ చైతన్య తాజాగా ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా పేరొందిన కిశోర్ తిరుమలతో సినిమా చేయడానికి ఓకే చెప్పేశాడట. ఈ చిత్రాన్ని RRR ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రకటన అతి త్వరలో రాబోతుందని అంటున్నారు. ఇక, ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూనే తీస్తున్నప్పటికీ.. సరికొత్త పంథాలో సాగుతుందని అంటున్నారు. ఇందులో నాగ చైతన్య సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే, అదేంటి అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.

     Naga Chaitanya Green Signal to Thirumala Kishore

    కిశోర్ తిరుమల ఈ ఏడాది రామ్ పోతినేని హీరోగా 'రెడ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దీని తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు. ఈ గ్యాప్‌లోనే నాగ చైతన్య కోసం అదిరిపోయే స్క్రిప్ట్ రెడీ చేశాడని తెలుస్తోంది. మరోవైపు, ఈ అక్కినేని హీరో ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నాడు. దాదాపు ఇందులో 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రను చేస్తున్నాడు. తద్వారా బాలీవుడ్‌లోకి ఇలా ఎంట్రీ ఇస్తున్నాడు.

    English summary
    Akkineni Naga Chaitanya Alredy Doing 3 Movies. and Now He Green Signal to Director Thirumala Kishore. D. V. V. Danayya Will Produce This Film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X