Naga Chaitanya Heroine: పెళ్లికి సిద్ధమైన నాగచైతన్య హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరల్
Naga Chaitanya Heroine Karthika Marriage: సీని పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అలనాటి హీరోయిన్ రాధ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ స్టార్ హీరోయిన్ కూతురు కార్తిక.. తెలుగులో జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నాగచైతన్య హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. కార్తీక తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే...
అలనాటి హీరోయిన్ రాధ కూతురు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. దక్షిణాది సినీ పరిశ్రమలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న.. ఆ తర్వాత సినిమాలకు విరామం ఇచ్చేసింది. ఇక ఆమె కూతురు కార్తీక... తెలుగులో జోష్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ నాగచైతన్యతో కలిసి జోష్ చిత్రంలో నటించి.. ఆకట్టుకుంది. అయితే ఆ సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.

జోష్ సినిమాలో కార్తీక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది ఈ ముద్దుగుమ్మ. జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమాలో సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ చేసి మెప్పించింది. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అవకాశాలు మాత్రం రాలేదు. దీంతో సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ రంగంలోకి వెళ్లిపోయింది.
తమిళ్ లో మాత్రం జీవాతో కలిసి కో అనే సినిమా చేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ మూవీ తెలుగులో రంగం పేరుతో రిలీజ్ అయింది. తెలుగులో కూడా సూపర్ హిట్టుగా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో కార్తిక నటనకు మంచి గుర్తింపు లభించింది. అయితే ఈ భామ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా కార్తీక తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఆ పోస్టు చూస్తే... హీరోయిన్ కార్తీక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అర్థం అవుతుంది. తాజాగా తన ఇన్ స్టాలో ఓ వ్యక్తిని హాగ్ చేసుకుంటూ ఉంగరం ధరించిన ఫోటోను నెటిజన్లతో పంచుకుంది ఈ భామ. ఇక ఆ ఫోటో చూస్తే ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగిందని తెలుస్తోంది. అయితే కార్తీక పెళ్లిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ ఆ పోస్టులో ఎలాంటి సమాచారం సైతం పెట్టలేదు.
ఇది చూసిన నెటిజన్స్ కార్తిక పెళ్లి చేసుకోబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే కార్తీకకు కాబోయే వరుడు ఎవరనేది మాత్రం సమాచారం లేదు. కొద్ది రోజులుగా కార్తీక ప్రేమ, పెళ్లి గురించి వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ రూమర్స్ పై కార్తీక నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. ఇక ఇప్పుడు ఆమె ఇన్ స్టా పోస్ట్ చూసి ఆ రూమర్స్ నిజమేనని భావిస్తున్నారు.
ఇక కార్తీక సోదరి తులసి కూడా కొన్ని సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. మణిరత్నం దర్శకత్వం వహించిన 'కడల్' సినిమాతో ఆమె తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ సినిమా తెలుగులో కడలి పేరుతో డబ్ అయింది. గౌతమ్ కార్తీక్ హీరోగా నటించగా... ఈ సినిమా పర్వాలేదనిపించింది.


Click it and Unblock the Notifications











