Karthika Nair: పెళ్లికి రెడీ అయిన నాగచైతన్య హీరోయిన్.. కాబోయే వాడు ఇతనే అంటూ పోస్ట్
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి సందడి ముగిసింది. ఇక అర్జున్ సర్జా కూతురు కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుంది. మరోవైపు అలా వైకుంఠపురుంలో నటుడు జయరాం కొడుకు కాలిదాస్ నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు మరో హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఇప్పటికే నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ.. తనకు కాబోయే వ్యక్తిని పరిచయం చేస్తూ పోస్ట్ పెట్టింది. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఇరుకుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల వెంకటేష్ కూతురు నిశ్చితార్థం కూడా వైభవంగా నిర్వహించారు. ఇక కోలీవుడ్ లో అర్జున్ సర్జా కూతురు నిశ్చితార్థం కూడా ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. వీరి ఎంగేజ్మెంట్ ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇక మలయాళ నటుడు జయరాం కొడుకు కాళిదాస్ జయరాం కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.

ఇక బాలీవుడ్ లో అమీర్ ఖాన్ కూతురు పెళ్లి చేసుకోబోతుంది. ఇలా అన్ని ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు సెలబ్రెటీలు. ఇక తాజాగా అలనాటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్ కూడా పెళ్లి సిద్ధం అయింది. ఇప్పటికే ఈ భామ నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు తాజాగా తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది. రాధ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కార్తీక.. ప్రేక్షకులను తనదైన అందం, నటనతో ఆకట్టుకుంది.

మొదట మణిరత్నం తీసిన కడలి చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కార్తీక. ఆ తర్వాత తెలుగులో 2009లో నాగ చైతన్య హీరోగా జోష్ అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కార్తిక హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2011లో విడుదలైన రంగంతో ఆమె విజయాన్ని విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో జీవాకు జోడిగా నటించింది. అంతే కాదు బాధ్యయుతమైన జర్నలిస్టుగా కనిపించి మెప్పించింది.
ఆ తర్వాత పలు తెలుగు, మలయాళం, తమిళ చిత్రాల్లో నటించింది ఈ భామ. ఇక తెలుగులో ఎన్టీఆర్ తో కలిసి దమ్ము అనే చిత్రంలో నటించింది. అయితే ఈ సిినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. ఇక అల్లరి నరేష్ తో కలిసి బ్రదర్ ఆఫ్ బొమ్మాళి అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా కామెడీ పరంగా పర్వాలేదనిపించింది. 2015 తర్వాత నుంచి కార్తిక వెండితెరకు దూరంగా ఉంటూ సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇక కార్తీక నాయర్ 33 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధం అయింది.

గత నెలలోనే ఈ భామ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. ఫేస్ కనబడకుండా ఫోటోస్ షేర్ చేసి షాక్ ఇచ్చింది. ఇప్పుడు తనకు కాబోయే వాడిని పరిచయం చేసింది ఈ భామ. కార్తీక నాయర్ చేసుకోబోయేది రోహిత్ మేనన్. అతడితో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోలు షేర్ చేసింది ఈ భామ. ఇక అందులో నిన్ను కలవడం విధి.. నిన్ను ఇష్టపడటం మ్యాజిక్.. మన జీవన ప్రయాణం మొదలు పెట్టడానికి కౌంట్ డౌన్ ప్రారంభించా అంటూ రాసుకువచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇవి చూసిన నెటిజన్స్ ఆమెకు విషెష్ చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











