Rashmika Mandanna: రష్మికకు సపోర్టుగా సినీ, రాజకీయ ప్రముఖులు.. ఆ ఫేక్ వీడియోలపై ఆగ్రహం!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ మార్ఫింగ్ వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ ఘటనపై పలువురు స్టార్స్ ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, సాయిధరమ్ తేజ్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద, ఎమ్మెల్సీ కవిత సహా పలువురు ప్రముఖులు రష్మికకు మద్దుతుగా నిలిచారు. వాళ్లు ఏం అన్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గత రెండు రోజులుగా హీరోయిన్ రష్మికకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రష్మిక ముఖంతో కనిపిస్తున్న ఓ అభ్యంతకరమైన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఎవరో ఆకతాయిలు... AI టెక్నాలజీతో రష్మిక ఫేస్ వేరే అమ్మాయి బాడీకి యాడ్ చేసి.. నెట్టింట వైరల్ చేశారు. ఇక ఈ వీడియో క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియోపై జర్నలిస్ట్ అభిషేక్.. ఫేక్ వీడియో, ఒరిజనల్ వీడియోలు కలిపి.. షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అమితాబ్ బచ్చాన్ సైతం రియాక్ట్ అవుతూ... ఫేస్ మార్ఫింగ్ చేసిన వారిని గుర్తించి శిక్షించాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ మినిస్టర్ కు ట్వీట్ చేశారు కూడా. ఇక ఇదిలా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీనిపై స్పందించింది. రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసిన వారిని గుర్తించి శిక్షించాలని ఆమె కోరింది.
ఇక ఇప్పటికే రష్మిక డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. మార్ఫింగ్ వీడియోస్ చేసిన వారిపై చర్యలు తప్పవని వెల్లడించారు. ఇక రష్మికకు మద్దతుగా టాలీవుడ్ సెలబ్రెటీస్ నిలుస్తున్నారు. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయి, టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ కూడా రియాక్ట్ అయ్యారు.
ఇక తాజాగా అక్కినేని నాగచైతన్య సైతం రష్మిక ఫేక్ వీడియోపై స్పందించారు. "టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉంది అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకువచ్చారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుందని వెల్లడించారు. భాదితుల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి వాటిపై కొత్త చట్టాలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. మీకు మరింత ధైర్యం, బలం చేకూరాలంటూ ట్విట్టర్ లో రాసుకువచ్చారు. చైతన్య్ ట్వీట్ కు రష్మిక స్పందిస్తూ ధన్యవాదాలు చెప్పింది.
ఇక రష్మిక మందన్నా కొంత మంది మార్ఫింగ్ చేశారు. అసలు ఆ వీడియోలో ఉన్నది...జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్. ఆమె బాడీకి ఎవరో రష్మిక ఫేస్ ను పెట్టి.. అలా వీడియోను మార్ఫింగ్ చేశారు. ఇక రష్మిక ఫ్యాన్స్ కూడా దీనిపై ఫుల్ ఫైర్ మీద ఉన్నారు. ఇలాంటి ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











