ఆ సినిమాతో ఎప్పుడో పరిచయం కావాల్సిన శ్రీలీల.. ఆమె చేసిన పనికి హీరో షాక్ అవడంతో!
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎక్కడా చూసిన వినిపిస్తున్న పేరు శ్రీలీల (Sreeleela). అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గానే కాకుండా బీభత్సమైన క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటిఫుల్. సీనియర్ హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించిన పెళ్లి సందD సినిమాతో మోస్ట్ పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ధమాకా మూవీతో హ్యూజ్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. దీంతో శ్రీలీల వెంట వరుసగా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా తెలుగు చిత్రపరిశ్రమకు ఎప్పుడో పరిచయం కావాల్సింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రిలీజ్ కానీ మూవీ: టాలీవుడ్‌లో అతివేగంగా స్టార్ హీరోయిన్‌గా మారింది గ్లామరస్ క్యూట్ బ్యూటి శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. పెళ్లి సందD సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ మొదటి సినిమా మాత్రం లవ్ యు ఇడియట్. అయితే ఈ సినిమా పలు కారణాలతో విడుదలకు నోచుకోలేదు. దీంతో ఆమె మొదటి సినిమా పెళ్లి సందD అయింది. ఇటీవలే లవ్ యు ఇడియట్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు.

ధమాకాలో ఛాన్స్: 2019లో వచ్చిన కిస్ (లవ్ యు ఇడియట్) సినిమా తర్వాత శ్రీలీల 2021 సంవత్సరంలో భరతే అనే మరో కన్నడ మూవీ చేసింది. ఆ తర్వాతే తెలుగులో అదే సంవత్సరం పెళ్లి సందD చిత్రంతో తెరంగేట్రం చేసింది. అనంతరం 2022లో మళ్లీ కన్నడలో బై టూ లవ్, జేమ్స్ చిత్రాలతో అలరించింది ఈ క్యూట్ సుందరి శ్రీలీల. ఇలా ఏదో ఒక సినిమా చేస్తున్న ఈ బ్యూటికి ధమాకాలో నటించే అవకాశం దక్కింది.
అగ్ర హీరోలు: అయితే 2022లో తెలుగులో రవితేజతో నటించిన ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది స్టన్నింగ్ బ్యూటి శ్రీలీల. ఇందులో ఆమె నటనకు, డ్యాన్స్ స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు అగ్ర హీరోల సరనస నటించే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. శ్రీలీల ప్రస్తుతం రామ్ పోతినేని స్కంద, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరి మేన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలు చేస్తోంది.

మొత్తంగా 7 చిత్రాలు: ఇవే కాకుండా బాలకృష్ణతో భగవంత్ కేసరితోపాటు విజయ్ దేవరకొండ మూవీ, అనగనగ ఒక రాజు అనే మరో చిత్రం మొత్తంగా 7 భారీ చిత్రాలతో బిజీగా ఉంది శ్రీలీల. అయితే శ్రీలీల పెళ్లి సందDతో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల అంతుకుముందు 2018లో తెలుగు సినిమాతో డెబ్యూ చేయాల్సి ఉంది. నాగ శౌర్య నటించిన ఛలో సినిమాకు రష్మిక మందన్నాతోపాటు శ్రీలీలను కూడా పరిశీలించారట మేకర్స్.
ఫస్ట్ ఆమెతోనే: ఇటీవల విడుదలైన రంగబలి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా "ఛలో సినిమాకు రష్మిక మందన్నాతో పాటు శ్రీలీల పేరును పరిశీలించారట కదా" అని హోస్ట్ అడిగితే.. "అవును సార్, శ్రీలీల ఫస్ట్ నాతో చేయాల్సి ఉంది" అని నాగశౌర్య తెలిపాడు. "ఇప్పుడు శ్రీలీల స్టార్ హీరోయిన్" అని యాంకర్ అంటే.. "నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆమె గురించి ఓ సంఘటన చెబుతాను" అని నాగశౌర్య షాక్ అయిన ఓ విషయం తెలిపాడు.

ఎవరూ చేయరు:"ఓసారి మా వైఫ్ ఇంటి నుంచి బయలుదేరి విమానంలో బెంగళూరు నుంచి వస్తున్నాను. శ్రీలీల నా లెఫ్ట్ సైడ్ లో కూర్చుంది. నన్ను ఆమె చూల్లేదు. ఎవరో ముసలావిడా వస్తే.. తన సీట్లో ఆమెను కూర్చోబెట్టి.. తను బ్యాక్ కు వెళ్లిపోయింది. ఎక్కువ దూరం నడవలేరని అలా చేసింది. ఇంత ఫామ్ లో ఉన్న ఏ హీరోయిన్ కూడా తనకు తానుగా వెళ్లి అలా చేయరు. ఆమె బ్యాగ్స్ కూడా హెల్ప్ చేయడం చూశాను. చాలా స్వీట్ పర్సన్" అని నాగ శౌర్య చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











