వైష్ణవిని అలా చూపిస్తాం.. బేబీ హీరోయిన్ డోస్ కు పిచ్చెక్కిపోవాలి.. నిర్మాత నాగవంశీ
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. 'బేబీ' సినిమాతో ఈ ముద్దుగుమ్మ సృష్టించిన సంచలనానికి రెండు తెలుగు స్టేట్స్ ఆడియెన్స్ ఫిదా అయిన సంగతి తెలిసిందే. అప్పటి వరకు పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించే అవకాశాలు దక్కించుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు హీరోయిన్ గా ఆఫర్లు సొంతం చేసుకుంటోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 'టచ్ చేసి చూడు', ' ఈ మాయ ప్రేమలో', 'అలా వైకుంఠపురంలో', 'రంగ్ దే', 'టక్ జగదీష్', 'వరుడు కావలెను', 'ప్రేమ దేశం' వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటించి మెప్పించింది.
ఇక 'బేబీ'లో ఆనంద్ దేవరకొండ సరసన నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తన నేచురల్ యాక్టింగ్ పాటు, రొమాంటిక్ సీన్లు, బోల్డ్ డైలాగ్స్ తో మాస్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగించింది. దాంతో ఈ తెలుగు బ్యూటీకి ఒక్కసారిగా క్రేజ్ పెరిగిపోయింది. వెంటవెంటనే ఆఫర్లు కూడా అందుతూ వచ్చాయి. అలా చేసిన చిత్రమే 'జాక్'. 'డీజే టిల్లు' చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తుండగా సిద్ధూ సరసన వైష్ణవి చైతన్య నటిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

అయితే, ప్రస్తుతం వైష్ణవి చైతన్య తన రాబోయే చిత్రం 'జాక్' ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇంట్రెస్టింగ్ ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై మరింత హైప్ పెంచేశారు. వారంరోజులుగా ఈవెంట్లు, ప్రెస్ మీట్లతో సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులు, ఆడియెన్స్ తో పంచుకుంటూ ఆసక్తి పెంచుతున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ జాక్ మూవీ ఈవెంట్ లో నిర్మాత నాగవంశీ హీరోయిన్ వైష్ణవి చైతన్యపై చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గ్గా మారాయి.
వైష్ణవి చైతన్య నటన బాగుంటుందని నెక్ట్స్ తనతో ఒక సినిమాను తీయబోతున్నామని నిర్మాత నాగవంశీ చెప్పారు. ఆ సినిమాలో వైష్ణవి చైతన్యను మరింత బోల్డ్ వెర్షన్ లో చూపిస్తామని, మోడ్రన్ భూతులు, అగ్రెసివ్ పాత్రలో చూపించబోతున్నామని అన్నారు. అప్పటికే వైష్ణవి చైతన్య భీమవరం వేదికపై 'ఓ ఫక్' అని మాట జారడంతో ట్రోల్ ను ఎదుర్కొంది. ఇక నాగవంశీ వైష్ణవి చైతన్యతో గట్టిగా భూతులు మాట్లాడిస్తామనడంతో మరింత హాట్ టాపిక్ అయ్యింది. ఇక జాక్ చిత్రం ఏప్రిల్ 10న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
జాక్ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై నిర్మించారు. రేపు గ్రాండ్ రిలీజ్ కు ఏర్పాట్లు చేశారు. విలక్ష నటుడు ప్రకాశ్ రాజ్, సినీయర్ నటుడు నరేశ్, బ్రహ్మాజీలు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి అచ్చు రాజమని, సురేశ్ బొబ్బిలి, సామ్ సీఎస్ మగ్గురు సంగీత దర్శకులు పనిచేయడం విశేషం. ఇప్పటికే రెండు పాటలు విడుదలై సంగీత ప్రియులను ఆకట్టుకున్నాయి. మరోవైపు 'బేబీ' చిత్రంతో వైష్ణవి చైతన్య 100 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 1కోటి వరకు రెమ్యునరేషన్ అందుకుంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో జాక్ చిత్రంతో ఎలాంటి రిజల్ట్ ను పొందుతుందనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











