For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నటి రోజాపై ‘ఐరన్ లెగ్’ మచ్చ తొలగిపోయినట్లేనా?

|

తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు నటిగా తన హవా కొసాగించిన రోజా... టాలీవుడ్లో దాదాపు అందరు అగ్రహీరోలతో నటించారు. సినిమాల్లో సక్సెస్‌ఫుల్ తారగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె రాజకీయాల్లోకి వచ్చిన పరిస్థతి అలా లేదు. 'ఐరన్ లెగ్' అనే అపవాదు మూటగట్టుకున్నారు. అందుకు కారణం 2009(టీడీపీ), 2014(వైసీపీ) ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహించిన పార్టీలు ఓటమి పాలవ్వడమే.

అయితే తాజా ఎన్నికల ఫలితాలు రోజాపై ఇప్పటి వరకు ఉన్న నెగెటివ్ ముద్రను తొలగించడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులు వేస్తోంది. ఉదయం 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మ్యాజిక్ ఫిగర్ సైతం దాటేసి 150 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

నగరిలో గెలుపు దిశగా రోజా...

2014 ఎన్నికల్లో నగరి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజా... 2019 ఫలితాల్లోనూ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం రోజా భారీ మెజారిటీతో దూసుకెళుతున్నారు. ఇక్కడ టీడీపీ తరుపున గాలి భాను ప్రకాష్, కాంగ్రెస్ తరుపున రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు.

భారీ మెజారిటీ దిశగా రోజా

నగరి నియోజకవర్గంలో మొత్తం 1,94,748 ఓటర్లు ఉన్నారు. ఇందులో 95,583 పురుషులు, 99,157 స్త్రీలు, 8 థర్డ్ జండర్ ఓట్లు ఎన్నాయి. ఈ సారి వైసీపీ గాలి బలంగా ఉండటంతో గత ఎన్నికల్లో కంటే రోజా అధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయంగా కనిపిస్తోంది.

రోజాను ఐరన్ లెగ్ అనే సాహసం ఇక ఎవరూ చేయరేమో...

నిన్నటి వరకు ప్రతి పక్షంలో ఉన్న రోజాను అధికార తెలుగు దేశం పార్టీకి చెందిన వారు ‘ఐరన్ లెగ్' అంటూ హేళన చేయడం తెలిసిందే. ఇక రోజాపై అలాంటి పదం వాడటానికి ఎవరూ సాహసం చేయరేమో. రోజాతో పాటు వైసీపీ కూడా అధికారంలోకి వస్తుండటంతో మున్ముందు పరిస్థితి ఎలా ఉండబోతోందో అనేది ఆసక్తిగా మారింది.

రోజా పొలిటికల్ కెరీర్

1999లో రోజా తెలుగు దేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. ఆ పార్టీ ఉమెన్ వింగ్ ‘తెలుగు మహిళ' ప్రెసిడెంటుగా పని చేశారు. 2009 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ తరుపున పోటీ చేసిన ఆమె ఓటమి పాలయ్యారు. తెలుగు దేశం కూడా అధికారం కోల్పోవడంతో.... ఆ తర్వాత వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున నగరి నియోజవర్గం నుంచి పోటీ చేసి గెలిచినప్పటికీ పార్టీ అధికారంలోకి రాలేక పోయింది. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
Nagari Election Results 2019: Roja Leading in Nagari Assemblyconstituency. Roja Selvamani is an Indian Film actress and politician.She was a leading actress from 1991 to 2002.She is the only actress, who acted in 100 films within 10 years in the 1990s. In 1999 she entered into politics and currently aligns with the YSR Congress party. She was elected as an MLA from Nagari in Andhra Pradesh in 2014. Now she is working as YSRCP state Women President.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more