‘నయనతారను ఆ హీరో వేధించడం నా కళ్లారా చూశా’

దక్షిణాది సినిమా రంగంలో స్పెషల్ అప్పీయరెన్స్ క్యారెక్టర్లలో నటించి మెప్పిస్తూ స్టార్ హీరోయిన్‌గా నయనతార గుర్తింపు తెచ్చుకొన్నది. గ్లామర్ హీరోయిన్ పాత్రలే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ కథలతో పవర్‌ఫుల్‌గా లేడీ సూపర్ స్టార్‌గా ఆమె మారింది. అయితే సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా మారిన ఆమె జర్నీలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలను అధిగమించారు. అయితే నయనతార ఎదుర్కొన్న ఓ కీలక వివాదం గురించి హీరో నాగార్జున స్వయంగా వెల్లడించారు. నయన్ ఎదుర్కొన్న ఆ ఇబ్బందికరమైన అంశం ఏమిటనే వివరాల్లోకి వెళితే..

నయనతార హీరోయిన్‌గా ప్రొఫెషనల్ లైఫ్‌ను, అలాగే పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకొంటూ వచ్చారు. సినీ రంగంలో కూడా తనకు ఎదురైన సమస్యలను అధిగమించిన ఆమె.. వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ వచ్చారనేది అందరికి తెలిసిందే. తన జీవితాన్ని అఫైర్లు, డేటింగ్ వ్యవహారాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి.

Nagarjuna Akkineni reveals Nayanathara s breakup story with A star hero in Nayanthara Beyond the Fairytale

తమిళంలో అగ్ర హీరోయిన్‌గా రాణిస్తున్న క్రమంలో స్టార్ హీరో శింబుతో ప్రేమలో పడింది. వారిద్దరి అఫైర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి బోలెడంత రొమాన్స్ చేశారనేది వారి ఫోటోలు చెప్పకనే చెప్పాయి. అయితే వారిద్దరి మధ్య సజావుగా సాగుతున్న లవ్ స్టోరికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. శింబు, నయన్ లవ్ స్టోరి బ్రేకప్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

శింబుతో బ్రేకప్ తర్వాత నయనతార పూర్తిగా కెరీర్‌పైనే దృష్టి పెట్టింది. బలమైన పాత్రలను ఎంచుకొంటూ తన కెరీర్‌ను చక్కదిద్దుకనే ప్రయత్నంలో పడ్డారు. ఆ సమయంలోనే ఆమె మరోసారి ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ఆ సమయంలో కూడా వారిద్దరూ వివాహం చేసుకొనేందుకు సిద్దమయ్యారు. నయన్ కూడా నటనకు గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారు. అయితే ఏం జరిగిందో ఏమో ఆ ప్రేమ కథ కూడా విఫలమైంది.

Nagarjuna Akkineni reveals Nayanathara s breakup story with A star hero in Nayanthara Beyond the Fairytale

తన జీవితంలో జరిగిన లవ్ బ్రేకప్‌ గురించి గురించి నాగార్జున అక్కినేని స్వయంగా ఇటీవల చెప్పారు. నాగ్‌తో కలిసి నటించే సినిమా షూట్ విదేశాల్లో జరిగింది. ఆ సమయంలో తన లవర్ నుంచి వచ్చిన వేధింపులను నేను స్వయంగా చూశాను. ఆ పాట షూటింగు టైమ్‌లో ఆమె చాలా టెన్షన్‌ను చూశాను. అయితే వాటిన్నింటిని పక్కన పెట్టి షాట్‌కు రెడీ అయ్యారు. షూటింగుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆమె చాలా ప్రొఫెషనల్‌గా వ్యహరించారు. ఆమె ఆ వేధింపులను తట్టుకొని బయటకు రావడం నేను కళ్లారా చూశాను అని నాగార్జున తెలిపారు.

నయనతార జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలు ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్ అనే టైటిల్‌తో రిలీజ్ అయింది. ఆ డాక్యుమెంటరీ కొన్ని వివాదాల్లో చిక్కుకొన్నది. తన అనుమతి లేకుండా కొంత కంటెంట్‌ను వాడుకోవడంపై ధనుష్ కేసు నమోదు చేయడం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీలో నాగార్జున మాట్లాడుతూ తన వంతు భాగంగా నయనతార గురించి వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X