యోగా పేరుతో షేపులు చూపిస్తూ.. చెమటలు పట్టిస్తున్న నాగార్జున హీరోయిన్

అందం, అభినయం ఉన్నా కొంతమంది అమ్మాయిలు ఎందుకో చిత్ర పరిశ్రమలో సరిగా రాణించలేక తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతుంటారు. ఈ కోవలోకే వస్తుంది పంజాబీ ముద్దుగుమ్మ పూనం బజ్వా. దాదాపు 20 ఏళ్లుగా హీరోయిన్‌గా ఉన్నప్పటికీ అంతగా స్టార్ డమ్ రాలేదు. విశాఖపట్నంలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ చదువు పూర్తవ్వగానే తొలుత మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. అక్కడ టాప్ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా పనిచేసి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది.

2005లో మొదటి సినిమా ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పూనం .. కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన బాస్‌లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఈ దెబ్బతో ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందని అంతా భావించారు. కానీ బాస్ ఫ్లాప్ కావడంతో పూనమ్ ఆశలు ఆవిరయ్యాయి. మళ్లీ రెండేళ్లకు వేడుక, పరుగులో నటించిన ఆమె తెలుగు తెరకు క్రమంగా దూరమయ్యారు. దాదాపు పదేళ్ల తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఎన్టీఆర్ బయోపిక్‌‌లో ఆయన పెద్ద కుమార్తె గారపాటి లోకేశ్వరిగా నటించారు పూనమ్ బజ్వా. చాలా మందికి ఈ సంగతి తెలిసి షాక్‌కు గురయ్యారు.

Nagarjuna heroine Poonam bajwa rocks the social media with latest yoga video here s the details

తెలుగునాట సరైన ఛాన్స్‌లు రాకపోవడంతో తమిళ్, కన్నడ , మలయాళం ఇండస్ట్రీలలో ఆమె తన అదృష్టం పరీక్షించుకుని కొంత మేరకు సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు హోమ్లీ అందాలతో పలకరించిన పూనమ్ బజ్వా.. కొన్ని సినిమాల్లో హాట్ హాట్‌గా కనిపించి కుర్రాళ్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చింది. 2022లో చివరిసారిగా మళయాళంలో పాథనోత్పం నూట్టండు, మే హూ మూసా.. తమిళ్‌లో గురుమూర్తి సినిమాల్లో నటించింది. తెలుగు తప్పించి మిగిలిన సౌత్ భాషల్లో కొద్దికాలం టాప్ హీరోయిన్‌గానే కొనసాగింది.

ఈ సినిమాల తర్వాత పూనం బజ్వాకు ఎలాంటి అవకాశం రాలేదు. వయసు పెరుగుతుండటం, కొత్త అందాల రాకతో ఆమెకు అవకాశాలు తగ్గుతున్నాయి. సినిమాలు లేకుండా సోషల్ మీడియా ద్వారా ప్రతినిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటోంది పూనం. ముఖ్యంగా తన కెరీర్, పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటోలు, వీడియోలకు భారీగా ఫాలోవర్స్ ఉన్నారు.

మొన్నామధ్య ASK ME అంటూ స్పెషల్ సెషన్ నిర్వహించగా.. ఈ సందర్భంగా ఓ నెటిజన్ నువ్వింకా సింగిల్‌గా ఎలా ఉండగలుగుతున్నావని ప్రశ్నించాడు. దీనికి ఆమె నేను సింగిల్ కాదంటూ బాయ్ ఫ్రెండ్‌తో కలిసున్న ఫోటోను షేర్ చేసి షాకిచ్చింది. యోగా, వర్కవుట్ చేసే వీడియోలు, ఫోటోలను పంచుకుంటూ సెగలు రేపే పూనం బజ్వా తాజాగా యోగ చేస్తున్న వీడియోను షేర్ చేసింది. ట్రాక్ ధరించి.. నడము, నాభి అందాలను చూపిస్తూ ఉన్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

More from Filmibeat

Read more about: nagarjuna poonam bajwa movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X