23 ఏళ్లకే అమ్మ శ్రీదేవీ, అక్క జాహ్నవిని మించిపోయిన ఖుషీ కపూర్!
అలనాటి అందాల తార శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే. ఆమె అందం ఇప్పటికీ అందరికీ కళ్లల్లో మెదలుతుంటుంది. అయితే అమ్మంత అందాన్ని అందిపుచ్చుకోకపోయినా.. ఆ స్థాయికి చేరుకోవడానికి మాత్రం ఆమె కూతుళ్లు తెగ కష్టపడుతున్నారు. ముఖ్యంగా పెద్ద కూతరు జాన్వీ కపూర్ ఇప్పటికే చాలా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. దేవర సినిమాతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. ఇక రెండో కూతురు సినిమాల్లోకి రాకపోయినా హీరోయిన్లకు ఏమాత్రం తక్కువ కాదు. అద్భుతమైన అందాలతో అందరినీ ఆగం చేస్తోంది. ఈమె తాజాగా పోస్ట్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాలీవుడ్ హాట్ బ్యూటీ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో జాన్వీ కపూర్ ఒకటి. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తోంది. పిచ్చెక్కించే పిక్స్ తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది జాన్వీ. కానీ ఇప్పుడు ఆమెను కూడా మించిపోయింది ఆమె చెల్లెలు ఖుషీ కపూర్. సినిమాల్లోకి ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో పడిపోయింది. అక్కకు మించిన హాట్ నెస్ తో రెచ్చిపోతూ.. కుర్రకారు గుండెల్లో హీటు పుట్టిస్తోంది.

ముఖ్యంగా మాడ్రన్ డ్రెస్ ల నుంచి పద్ధతైన చీర కట్టు, పరికిణీ వరకు అన్ని ఔట్ ఫిట్లను ధరిస్తూ.. వాటిని నెట్టింట పోస్ట్ చేస్తుంటుంది. అలాగే తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్టాగ్రామ్ వేధికగా కొన్ని హాట్ ఫొటోలను పోస్ట్ చేసింది. అందులో ఖుషీ కపూర్ అందాలు చూస్తే అంతా ఫిదా అయిపోతారు. గోల్టెడ్ కలర్ స్ట్రాప్ డ్రెస్ వేసుకుని పైనుంచి కింద వరకు అందాలన్నీ ఆరబోసింది. ఈ ఫొటోలు చూసిన నెటిజెన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.
అందంగా ఉన్నావు, అదిరిపోయావు, నీ హాట్ నెస్ ని తట్టుకోలేకపోతున్నా... హాట్ నెస్ ఓవర్ లోడెడ్ అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈ ముద్దుగుమ్మ వేసుకున్న ఈ డ్రెస్ చాలా కాస్ట్లీ అని కూడా నెట్టింట చర్చ చేస్తున్నారు. గోల్డ్ కలర్ లో ఉన్న ఈ స్ట్రాప్ డ్రెస్ అక్షరాల 71 వేలు అని అంటున్నారు. వీటిపై కూడా ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఇంత గ్లామర్ షో చేస్తుందని కూడా చర్చ సాగుతోంది.

త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించేందుకు అవకాశాల కోసం ట్రై చేస్తున్న ఈమె.. ముందుగా ఇన్ స్టా వేదికను గట్టిగా వాడుకుంటోందని అంటున్నారు. శ్రీదేవి, బోనీ కపూర్ వారసత్వాన్ని అందిపుచ్చుకునేందుకు ఖుషీ కపూర్ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియాలో అక్క జాన్వీ కపూర్ కు ఉన్న ఫాలోయింగ్ ను పెంచుకోవాలని.. ఈమె కూడా అక్క బాటలోనే నడుస్తుంది. చూడాలి మరి ముందు ముందు ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











