సానియా టెన్నిస్ ఆడుతూ చూపిస్తుంది.. ఆ హీరోయిన్ బట్టలన్నీ విప్పేసింది: తెలుగు నటి కామెంట్స్

తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్య కాలంలోనే చాలా మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా మంది సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కాంపౌండ్ నుంచే వచ్చారు. అలాంటి వారిలో గోదావరి జిల్లా అమ్మాయి శ్రీ రాపాక ఒకరు. అతడు తెరకెక్కించిన సినిమానే సెన్సేషన్ అయిపోయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత సినిమాలు, రాజకీయాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పుడు పెద్దగా వెండితెరపై సందడి చేయని శ్రీ రాపాక.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే...

వర్మ మూవీలో సంచలనం
మోడలింగ్ రంగంలో అలరిస్తోన్న సమయంలోనే శ్రీ రాపాక సినిమా వాళ్ల దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ డెన్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా అతడి దర్శకత్వంలో ఈ తెలుగు పిల్ల 'నగ్నం' అనే సినిమాలో నటించింది. ఇందులో తనదైన గ్లామర్ షోతో మాయ చేసింది. ఫలితంగా శ్రీ రాపాక ఒక్కసారిగా సంచలనం అయింది. దీంతో ఆమె పేరు మారుమ్రోగిపోయింది.

Nagnam Heroine Shree Rapaka Sensational Comments on Sania Mirza

బిగ్ బాస్‌లోకి వెళ్లినా కానీ
'నగ్నం' సినిమా చేసిన తర్వాత శ్రీ రాపాక యమా హైలైట్ అయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఓటీటీ సీజన్‌లో అవకాశం దక్కించుకుంది. ఇందులోకి ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ అమ్మడు.. ఆరంభంలోనే బయటకు వెళ్లిపోయింది. అయినప్పటికీ ఆమెకు మంచి పేరు వచ్చింది. అదే సమయంలో శ్రీ రాపాకకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా వచ్చాయి.

ఆ మూవీలు.. రాజకీయం
బిగ్ బాస్ తర్వాత శ్రీ రాపాకకు బోల్డు సినిమాల్లో అవకాశాలు లభించాయి. కానీ, వాటిని చేయడానికి ఆమె ముందుకు రాలేదు. కానీ, ఈ మధ్యన మాత్రం ఈ తెలుగు హీరోయిన్ 'గులాబీ', 'మరణం' వంటి చిత్రాల్లో నటించింది. ఇవి ఆమెకు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక, శ్రీ రాపాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. గత ఎన్నికల్లో కూటమి తరపున ప్రచారం కూడా చేసింది.

నేనా డ్రెస్‌ను వేసుకున్నా
ఆర్జీవీ కాంపౌండ్ హీరోయిన్‌గా ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న శ్రీ రాపాక తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన బోల్డ్ మూవీ 'నగ్నం' గురించి ప్రస్తావించింది. 'నగ్నం సినిమాలో స్కిన్ కలర్ డ్రెస్ వేసుకున్నా. అందరూ అనుకున్నట్లు నగ్నంగా లేను. అయినా అందులో తప్పు ఏమీ లేదని నేను భావిస్తున్నాను' అని చెప్పింది.

Nagnam Heroine Shree Rapaka Sensational Comments on Sania Mirza

ఆ హీరోయిన్ నగ్నంగానే
ఈ ఇంటర్వ్యూలో శ్రీ రాపాక కంటిన్యూ చేస్తూ.. 'నేను నిజంగా నగ్నంగా కనిపించలేదు. దానికోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. అమలా పాల్ మాత్రం ఆమె అనే సినిమాలో బట్టలన్నీ విప్పేసింది. అప్పుడు టెక్నీషియన్ల మధ్యనే ఆమె నగ్నంగా నటించింది. గతంలో కొందరు కూడా అలానే చేశారు. ఇష్టం లేని వాళ్లు మాత్రం నాలాగ బాడీ షూట్ వేస్తారు' అంటూ వివరించింది.

సానియా చూపిస్తుంది
శ్రీ రాపాక కొనసాగిస్తూ.. 'నేను షార్ట్ వేశాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా థైస్ బాగుంటాయని అందరూ అనేవారు. అందులో తప్పు లేదు. ఎందుకంటే టెన్నిస్ ఆడుతున్న సమయంలో సానియా మీర్జా తన ఇన్నర్స్ కూడా చూపిస్తుంది. ఆమె షాట్ కొట్టినప్పుడల్లా డ్రెస్ పైకి లేచి అవి కనిపిస్తాయి. అందులో న్యూడిటీ లేదు. చూసే వాళ్లలోనే తేడా ఉంది' అని చెప్పింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X