నగ్నంగా ఉంటే ఆ డైరెక్టర్ వదలడు.. తెలుగు హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
గతంలో కంటే ఇప్పుడు ఎంతో మంది తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి వచ్చి తమ సత్తాను నిరూపించుకుంటున్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే బోల్డుగా ఉంటూ భారీగా పేరు సంపాదిస్తున్నారు. అలాంటి వారిలో గోదావరి అమ్మాయి శ్రీ రాపాక ఒకరు. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'నగ్నం' చిత్రంతో సెన్సేషన్ అయిన ఈ చిన్నది.. ఆ తర్వాత కొన్ని చిత్రాలకే పరిమితం అయింది. అయినప్పటికీ తరచూ ఏదో ఒక పనితో హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీ రాపాక.. రాంగోపాల్ వర్మ గురించి క్రేజీ కామెంట్స్ చేసింది. ఆ వివరాల్లోకి వెళితే....
నగ్నంతో సంచలనంగా
సినిమాలపై ఉన్న మక్కువతో మోడల్‌గా ప్రయాణాన్ని మొదలు పెట్టిన శ్రీ రాపాక.. చాలా బ్రాండ్లకు పని చేసింది. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ కాంపౌండ్‌లోకి అడుగు పెట్టింది. అలా ఈ అమ్మడు 'నగ్నం' అనే సినిమాలో నటించింది. ఇందులో తనదైన అందచందాలతో మాయ చేసి మెప్పించింది. దీంతో శ్రీ రాపాక ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయిపోయింది.

బిగ్ బాస్ షోతో మరింత
రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'నగ్నం' చిత్రంతో హాట్ టాపిక్ అయిపోయిన శ్రీ రాపాకకు బిగ్ బాస్ నిర్వహకులు ఓటీటీ సీజన్‌లో అవకాశం కల్పించారు. ఇందులోకి ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ అమ్మడు.. ఆరంభంలోనే ఎలిమినేట్ అయిపోయింది. అయినప్పటికీ ఆమెకు మంచి పేరు వచ్చింది. అదే సమయంలో శ్రీ రాపాకకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా లభించాయి.
ఆ సినిమాలు చేసింది
'నగ్నం' సినిమా తర్వాత శ్రీ రాపాకకు ఎక్కువగా అదే తరహా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ, వాటిని చేయడానికి ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు. కానీ, ఈ మధ్యన మాత్రం ఈ తెలుగు హీరోయిన్ 'గులాబీ', 'మరణం' వంటి చిత్రాల్లో నటించింది. ఇవి ఆమెకు పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో శ్రీ రాపాక సినిమా అవకాశాలు ఆశించిన స్థాయిలో లభించలేదనే చెప్పాలి.

రాజకీయాల్లో.. పవన్‌తో
సినిమా ఛాన్స్‌లు అందుకోవడంలో విఫలం అయిన శ్రీ రాపాక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన స్వగ్రామం అయిన దేవరపల్లిలో ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించింది. మొదట్లో టీడీపీలో ఉన్న ఆమె.. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇక, గత ఎన్నికలకు ముందు మాత్రం కూటమికి సపోర్ట్ చేసింది. పవన్ కల్యాణ్ పార్టీ కోసం చాలా ప్రాంతాల్లో ప్రచారం చేసింది.
నగ్నంగా చేయలేదని
సినిమాలు, రాజకీయాలతో సెన్సేషన్ అయిన శ్రీ రాపాక తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన బోల్డ్ మూవీ 'నగ్నం' గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. 'నగ్నం సినిమాలో నేను అంతా అనుకున్నట్లుగా నిజంగా నగ్నంగా కనిపించలేదు. స్కిన్‌తో కలిసిపోయే డ్రెస్ వేసుకుని నటించాను. ఆ విషయం చాలా మందికి తెలియదు' అని చెప్పింది.

మియాకు పెట్టినట్లుగా
ఆ తర్వాత శ్రీ రాపాక కంటిన్యూ చేస్తూ.. 'నేను నిజంగా నగ్నంగా నటించి ఉంటే రాంగోపాల్ వర్మ నన్ను వదిలేవాడు కాదు. మియా మాల్కోవాకు పెట్టినట్లుగా నా అందాలను చూపిస్తూ యాంగిల్స్ పెట్టేవాడు. వాస్తవానికి నగ్నం సినిమా షూట్ సమయంలో మా ఇద్దరితో పాటు కెమెరామెన్ ఒక్కడే ఉన్నాడు. ఈ షూట్ మొత్తం తక్కువ మందితోనే జరిగింది' అంటూ వివరించింది.


Click it and Unblock the Notifications











