సిల్క్ స్మిత నాకు ఆదర్శం.. అంతా మాత్రానే అలాంటిదానినా? నేకెడ్ హీరోయిన్ నోట షాకింగ్‌గా

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన నేకెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన గురిచేసిన నటి హీరోయిన్ శ్రీ రాపాక జీవితం గురించి తెలిస్తే ఆశ్చర్యానికి గురికావాల్సిందే. ఎందుకంటే ఆమె తెలుగు సినీ పరిశ్రమకు కొత్తేమీ కాదు. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో క్యాస్టూమ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా నేకెడ్ రిలీజ్ తర్వాత తన వ్యక్తిగత జీవితం, ప్రొఫెషనల్ జీవితం గురించి వెల్లడిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రాశీఖన్నాతో జరిగిన గొడవ వెనుక కారణాలను చెబుతూ..

వేరే డైరెక్టర్ ఆఫరిస్తే

వేరే డైరెక్టర్ ఆఫరిస్తే

నేను యాక్టింగ్ సైడ్ వస్తానని ఎన్నడూ అనుకోలేదు. మరో డైరెక్టర్ వచ్చి నేకెడ్ లాంటి సినిమా ఆఫరిస్తే నేను చేసేదానిని కాదు. రాంగోపాల్ వర్మ ఆఫర్ ఇచ్చారు కాబట్టి నేను చేశాను. ఆర్జీవికి ఆ బ్రాండ్ ఉంది. దాంతో నటిగా నేను ఎలివేట్ అవుతానని భావించాను. అందుకే నేకెడ్ సినిమాలో నటించాను అని శ్రీ రాపాక చెప్పారు.

శృంగార పాత్రలను ఒప్పుకోను..

శృంగార పాత్రలను ఒప్పుకోను..

నేకెడ్ సినిమా తర్వాత నేను ఇప్పుడు ఓ హారర్ ఫిలిం చేస్తున్నాను. నెకెడ్ సినిమా తర్వాత అన్నీ అలాంటి పాత్రలు వస్తాయంటే నేను ఒప్పుకొను. అలాంటి పాత్రలు వస్తే చేయాలా వద్దా అనేది ఒకరి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. నాకు డబ్బు ఇంపార్టెంట్ కాదు. నాకు మరో కెరీర్ ఉంది. యాక్టింగ్ అనేది నాకు ముందుకు వచ్చిన ఛాయిస్‌ను, నా అభిరుచిని వాడుకొంటున్నాను అని శ్రీ రాపాక అన్నారు.

నిఫ్ట్‌లో డిజైనింగ్ టాపర్‌ను

నిఫ్ట్‌లో డిజైనింగ్ టాపర్‌ను

బేసిక్‌గా నేను టాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్‌ను. ఎన్నో చిత్రాలకు చాలా మంది డైరెక్టర్లు, హీరోయిన్లతో పనిచేశాను. నేను బాగా చదువుకున్న దానిని. నిఫ్ట్‌లో టాపర్ స్టూడెంట్‌ను. స్పోర్ట్స్‌లో నేను రాణించాను. అలాగే యూఎస్‌లో చాలా కాలం ఉన్నాను. అలాంటి మెచ్యురిటీ ఉన్న ప్రొఫెషనల్‌ను. అంతేగానీ నేను వాంప్ క్యారెక్టర్లు వేసే వ్యక్తిని కాదు అని శ్రీ రాపాక ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

సిల్క్ స్మిత నాకు ఆధర్శం

సిల్క్ స్మిత నాకు ఆధర్శం


శృంగార తారలు అంటే చిన్నచూపు చూడవద్దు. సిల్క్ స్మిత కొన్ని విషయాల్లో నాకు ఆదర్శం. సిల్క్ స్మిత వ్యాంప్ అంటే ఒప్పుకొను. ఆమె ఏ హీరోయిన్‌కు తీసిపోని వ్యక్తి. ఆమె కోసం చాలా పెద్ద హీరోలు వెయిట్ చేసేవారు. అయితే ఆమె తలచుకొంటే ఓ మంచి నటి గుర్తుకు వస్తారు గానీ శృంగార తార నాకు గుర్తుకురారు అని శ్రీ రాపాక చెప్పారు.

క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశా

క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశా

గతంలో సుప్రీం సినిమాకు నేను క్యాస్టూమ్ ఢిజైనర్‌గా పనిచేశాను. అంతకు ముందు అనిల్ రావిపూడితో కొన్ని సినిమాలకు పనిచేశాను. నేను ఆయన దర్శకత్వం వహించిన పటాస్ కూడా పనిచేశాను. సుప్రీం సినిమాకు పనిచేసే సమయంలో నాకు రాశీ ఖాన్నకు గొడవ జరిగింది. తెల్లవారు జామును 3 గంటలకు చీరకట్టడానికి పిలిచారు. అయితే ఆమె నాతో అమర్యాదగా ప్రవర్తించడంతో చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మరో సినిమాకు పనిచేసే అఫర్ వస్తే కుదరదు అని చెప్పాను అని శ్రీ రాపాక అన్నారు.

Recommended Video

Sakshi Chopra Shedded All Her Clothes And Went Naked
తెలుగు వాళ్లంటే బాలీవుడ్‌కు చిన్నచూపు

తెలుగు వాళ్లంటే బాలీవుడ్‌కు చిన్నచూపు


ముంబై, బాలీవుడ్ నుంచి వచ్చే హీరోయిన్లకు తెలుగు వారంటే చిన్నచూపు. వారికి ప్రతిభ లేకున్నా టెక్కు చూపిస్తారు. మన డైరెక్టర్లు కూడా అలాంటి వారికి అవకాశాలు ఇస్తారు. తెలుగు టెక్నిషియన్లు అన్నా.. తెలుగు వారంటే హిందీ నుంచి వచ్చే వారికి ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. అందుకే చాలా మంది హీరోయిన్లతో క్యాస్టింగ్ డిజైనర్‌గా పనిచేయడం కుదరదని ముఖం మీదే చెప్పారు. నా ఎడ్యుకేషన్ కారణంగా నాలో ఒక రకమైన టెంపర్ ఉంటుంది. కనీసం చదువు రాకపోయినా హీరోయిన్లు ఇగో ప్రదర్శిస్తుంటారు అని శ్రీ రాపాక ఫైర్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X