Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
బాలయ్య మూవీలో బ్యాడ్ లేడీగా కనిపించబోతున్న నమిత?
ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీని తన గ్లామర్‌తో ఓ ఊపు ఊపిన నమిత ఈ మధ్య కాలంలో సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆమె బాగా పాపులర్ అయింది మాత్రం తమిళనాడులోనే. తన గ్లామర్‌తో తమిళ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారిపోయారు. అజిత్, విజయ్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేశారు.
అయితే తాను కోరుకున్న విధంగా ఆసక్తికర పాత్రలు రాక పోవడంతో నమిత సినిమాలు చేయడం తగ్గించేశారు. కొత్త తరం రాకతో ఆమెను తమ సినిమాల్లో తీసుకునే ఫిల్మ్ మేకర్స్ సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. నమిత చివరగా తమిళంలో భరత్ హీరోగా వచ్చిన పోటు అనే చిత్రంలో కనిపించింది. అంతే కాదు తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పాల్గొని కొన్ని రోజులకే ఎలిమినేట్ అయ్యారు.
తాజా సమాచారం ప్రకారం నమిత త్వరలో తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో బాలయ్య చేయబోయే మూవీలో నమిత కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో నమిత బాలయ్యతో కలిసి 'సింహా' మూవీలో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె చివరగా నటించిన చిత్రం 'నమిత ఐ లవ్ యు'.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నమిత ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇంతకు ముందు బాలయ్య-కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో 'జై సింహ' మూవీ వచ్చింది. ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్ సాధించింది. ఇపుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. సి కళ్యాణ్ నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కబోతోంది.