twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలయ్య మూవీలో బ్యాడ్ లేడీగా కనిపించబోతున్న నమిత?

    |

    ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీని తన గ్లామర్‌తో ఓ ఊపు ఊపిన నమిత ఈ మధ్య కాలంలో సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆమె బాగా పాపులర్ అయింది మాత్రం తమిళనాడులోనే. తన గ్లామర్‌తో తమిళ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారిపోయారు. అజిత్, విజయ్ లాంటి టాప్ హీరోలతో సినిమాలు చేశారు.

    అయితే తాను కోరుకున్న విధంగా ఆసక్తికర పాత్రలు రాక పోవడంతో నమిత సినిమాలు చేయడం తగ్గించేశారు. కొత్త తరం రాకతో ఆమెను తమ సినిమాల్లో తీసుకునే ఫిల్మ్ మేకర్స్ సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. నమిత చివరగా తమిళంలో భరత్ హీరోగా వచ్చిన పోటు అనే చిత్రంలో కనిపించింది. అంతే కాదు తమిళ బిగ్ బాస్ సీజన్ 2లో కూడా పాల్గొని కొన్ని రోజులకే ఎలిమినేట్ అయ్యారు.

    తాజా సమాచారం ప్రకారం నమిత త్వరలో తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. కెఎస్ రవి కుమార్ దర్శకత్వంలో బాలయ్య చేయబోయే మూవీలో నమిత కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో నమిత బాలయ్యతో కలిసి 'సింహా' మూవీలో నటించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమె చివరగా నటించిన చిత్రం 'నమిత ఐ లవ్ యు'.

    Namitha to make a comeback with Balakrishnas film?

    ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నమిత ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌ను హీరోయిన్‌గా తీసుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

    ఇంతకు ముందు బాలయ్య-కెఎస్ రవికుమార్ కాంబినేషన్లో 'జై సింహ' మూవీ వచ్చింది. ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్ సాధించింది. ఇపుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కావడంతో మంచి అంచనాలు ఉన్నాయి. సి కళ్యాణ్ నిర్మాతగా ఈ మూవీ తెరకెక్కబోతోంది.

    English summary
    Actress Namitha is now rumoured to be making a comeback in Telugu with a film by KS Ravikumar, who is all set to direct actor Balakrishna.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X