ఆ హీరోయిన్‌పై మోజు.. ఎయిర్‌పోర్ట్‌లోనే అభిమాని కిడ్నాప్,.. ఆ బ్యూటీ ఎవరో తెలుసా?
భారతదేశంలో సినీతారలను అభిమానులు దైవంలా పూజిస్తారన్న సంగతి తెలిసిందే. కొందరైతే ఏకంగా గుడులు కట్టేస్తారు. తమిళనాడులో ఈ పిచ్చ కొంచెం ఎక్కువ ఉంటుంది. బొద్దుగా ముద్దుగా ఉండే హీరోయిన్లను ఇష్టపడే తమిళ తంబిలు గతంలో ఖుష్బూకి గుడి కట్టగా.. ఆ తర్వాత అలాంటి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు నమిత. అయితే ఆమె జీవితంలో ఓ అభిమాని వల్ల జరిగిన భయంకరమైన అనుభవాన్ని నమిత ఇటీవల బయటపెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..
గుజరాత్‌కు చెందిన నమిత.. 2002లో కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన సొంతం సినిమాతో తెలుగువారిని పలకరించారు నమిత. ఆ వెంటనే జెమినీ, ఒకరాజు ఒకరాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి వంటి సినిమాల్లో నటించింది. కానీ తనకు టాలీవుడ్ అంతగా కలిసి రావడం లేదని అర్దం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. విజయ్ కాంత్ సరసన ఎంగల్ అన్న ద్వారా తమిళ పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చింది.

ఆమె అందాలకు తమిళ తంబీలు ఫిదా అయిపోయారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో నమిత కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఈ క్రమంలో ఏకంగా నమితకు గుడికట్టి పూజలు చేశారు. దాంతో తెలుగు తెరకు పూర్తిగా దూరమైన ఆమె .. లాంగ్ గ్యాప్ తర్వాత బిల్లా, సింహా తదితర సినిమాలతో కమ్ బ్యాక్ ఇచ్చారు. భారీగా బరువు పెరగడం, కొత్త అమ్మాయిల రాకతో నమితకు అవకాశాలు తగ్గిపోయాయి. ఇక పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్న నమిత.. వీరేంద్ర చౌదరితో ప్రేమలో పడి 2017 నవంబర్ 24న వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.
సినిమాల పరంగా దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నారు. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కవ్విస్తుంటారు. ఇక గతేడాది ఓ ఆలయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నమిత పంచుకుని వార్తల్లోకెక్కారు. రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరిన నమిత యాక్టీవ్‌గా ఉన్నారు. ఇప్పటికీ నమితను వెర్రీగా ఆరాధించే అభిమానులు ఉన్నారు. ఇదిలాఉండగా.. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఓ నమిత వీరాభిమాని అత్యుత్సాహం ఆమెకు ముచ్చెమటలు పట్టించింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నమిత ఈ విషయాన్ని బయటపెట్టారు. 2009 ప్రాంతంలో ఓ చిత్రం షూటింగ్ కోసం తాను కోయంబత్తూరుకు వెళ్లానని.. విమానాశ్రయంలో దిగగానే ఓ వ్యక్తి డ్రైవర్‌గా పరిచయం చేసుకున్నాడని నమిత తెలిపారు. యూనిట్ సభ్యులు ఎవరైనా కారు పంపించారని అనుకుని మేనేజర్‌తో కలిసి కారెక్కారు. ప్రయాణంలో నిద్రపోయి లేచి చూసేసరికి కారు ఎంతకీ ఆగకపోవడంతో డౌట్ వచ్చిందని చెప్పారు. ఆ వెంటనే తమ కారును కొన్ని కార్లు అనుసరించాయని.. అది చూసిన మేనేజర్ మనం కిడ్నాప్ అయ్యామని చెప్పడంతో తన నోటి వెంట మాట రాలేదన్నారు. తనను కిడ్నాప్ చేసిన వ్యక్తి నాకు అభిమాని అని.. తనను పెళ్లి చేసుకోవడానికే ఇలా చేశాడని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











