నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు: మహేష్ బాబు భార్య నమ్రత ఎమోషనల్ పోస్ట్
Recommended Video
మహేష్ బాబు హీరోగా రూపొందిన 25వ చిత్రం 'మహర్షి' గురువారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సందర్బంగా సూపర్ స్టార్ గురించి ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా పేజీలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 'మహర్షి' మూవీ కోసం మహేష్ ఎంత కష్టపడ్డారో చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఉన్న ఒక రేర్ మూమెంట్ పిక్ అభిమానులతో పంచుకున్నారు. 'మహర్షి' ఒక గొప్ప సినిమా అవుతుందని, ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు టీమ్ మొత్తం చాలా శ్రమించిందని తెలిపారు.


నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు
మే 9 బిగ్ డే... ‘మహర్షి' సినిమా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత అంకింత భావంతో పని చేశావో తెలుసు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందనే పూర్తి నమ్మకం ఉందంటూ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మహేష్ బాబును ఉద్దేశించి పేర్కొన్నారు. నమ్రత తన పోస్ట్ ద్వారా సినిమాపై మరింత అంచనాలు పెంచే ప్రయత్నం చేశారు.

రిషి పాత్ర ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి ఇస్తుంది
రిషి జర్నీ తెరపై చూసినపుడు ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతికి లోనవుతారని నమ్రత తెలిపారు. రిషి పాత్రను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు, రిషి తన ప్రయాణంలో మహర్షిగా మారిన తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.

గుడ్ లక్ టు యూ మై లవ్
గుడ్ లక్ టు యూ మై లవ్ అంటూ.... నమ్రత షేర్ చేసిన ‘మహర్షి' మూవీ సందేశానికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ పోస్టను ప్రముఖ నటి సమంత కూడా లైక్ చేయడం విశేషం. మరో వైపు ‘మహర్షి' మూవీ సూపర్ పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది.

ఫోటోపై అభిమానుల ఫన్నీ కామెంట్
నమ్రత షేర్ చేసిన ఫోటోలో మహేష్ బాబు... భార్యను ఆలింగనం చేసుకుని చిన్న పిల్లాడిలా ఆమె కౌగిలిలో ఇమిడిపోయాడు. ఈ ఫోటోపై ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మీ జంట ఎంతో అద్భుతంగా ఉంది, స్పూర్తిదాయకమైన కపుల్ అంటూ కామెంట్లు గుప్పిస్తున్నారు.

మహర్షి
మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా ‘మహర్షి' తెరకెక్కుతోంది. పూజా హెడ్గే హీరోయిన్‌గా నటిస్తుండగా... అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, నరేష్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











